ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. సరే అని సంతోషించేలోపే జట్టులో ఆ సమస్యలు ఇంకా అలానే ఉండటం అందరినీ భయపెడుతున్నాయి. ఇంతకీ ఏంటవి?
ముంబయి ఇండియన్స్ పేరు చెప్పగానే ఫ్యాన్స్ గర్వంగా ఫీలవుతారు. ఎందుకంటే ఐపీఎల్ లో ఏ జట్టుకు సాధ్యం కానీ విధంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది. అద్భుతమైన క్రికెటర్లు జట్టులో ఉన్నారు. లీగ్ లో మంచి క్రేజ్ ఉన్న జట్లలో ఇదొకటి. ఇలా ఏం చూసినా ముంబయి టాప్ లోనే ఉంటుంది. అలాంటి ఈ జట్టు ఈసారి మొదట్లో కాస్త తడబడింది. తాజాగా ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో రయ్ అని పైకి దూసుకొచ్చింది. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. కానీ ఓ రెండు సమస్యలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. ఫ్యాన్స్ ని తెగ భయపెడుతూనే ఉన్నాయి. ఇంతకీ అవేంటి?
అసలు విషయానికొస్తే.. టైటిల్ ఫేవరెట్ లో ఒకటైన ముంబయి ఈసారి ఐపీఎల్ ని రెండు ఓటములతో స్టార్ట్ చేసింది. దీంతో అందరూ జట్టుపై విమర్శలు చేశారు. ఆ వెంటనే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ గెలుస్తూ ఓడుతూ వస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచులు జరిగితే ఆరింట్లో గెలిచి, ఐదింట్లో ఓడిపోయి 12 పాయింట్లతో ఉంది. మిగతా మ్యాచుల్లో కచ్చితంగా రెండు గెలవాలి. అదే టైంలో మిగతా జట్ల మ్యాచ్ ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ముంబయి రన్ రేట్ తక్కువగా ఉంది కాబట్టి. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. ముంబయికి 50/50 ఛాన్సులున్నాయి. ప్రాబ్లమ్స్ మాత్రం చాలానే కనిపిస్తున్నాయి.
ముంబయి ఇండియన్స్ కి ఈ సీజన్ లో అతిపెద్ద సమస్యలు అంటే ఒకటి కెప్టెన్ రోహిత్ శర్మ. బ్యాటింగ్ లో ఘోరంగా అంటే ఘోరంగా ఫెయిలవుతున్నారు. ఇప్పటివరకు 11 మ్యాచుల్లో కేవలం 191 పరుగులే చేశాడంటే పరిస్థితి ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు. రాబోయే మ్యాచ్ ల్లో రోహిత్ కుదురుకుంటే జట్టుకు మరింత బలమవుతుంది. లేదంటే అదే శాపమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రెండో సమస్య బౌలింగ్. ఆర్సీబీ బ్యాటర్లని ఔట్ చేయలేక ఏకంగా 199 పరుగులు సమర్పించేసుకుంది. ఇలా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చేసింది ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఏమైనా తేడా కొడితే ముంబయి ఇంటికొచ్చేయడం గ్యారంటీ. మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Mumbai Indians in IPL 2023:
– Chase down 215 vs PBKS.
– Chase down 213 vs RR.
– Chase down 200 vs RCB.The chasing team of this season. pic.twitter.com/2PgpgJXnF4
— Johns. (@CricCrazyJohns) May 9, 2023