ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో సీఎస్కేకు ఒక భయం పట్టుకుంది. అదేంటంటే..!
ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జోరుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్రేకులు వేసింది. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 144 రన్స్ చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (17), డెవాన్ కాన్వే (30)తో పాటు అజింక్యా రహానె (16) తమకు దక్కిన శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో ఫెయిలయ్యారు. అయితే శివమ్ దూబే (48) ఆఖర్లో చెలరేగడంతో చెన్నై గౌరవప్రదమైన లక్ష్యాన్ని కోల్‌కతా ముందు ఉంచింది. కేకేఆర్ బౌలర్లలో పేసర్లు వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలో రెండు వికెట్లతో చెన్నైని బాగా కట్టడి చేశారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన కేకేఆర్‌కు మంచి స్టార్ట్ దొరకలేదు. ఆ జట్టు ఓపెనర్ రెహ్మదుల్లా గుర్బాజ్ (1)ను చెన్నై పేసర్ దీపక్ చాహర్ క్రీజులో కుదురుకోనివ్వలేదు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (12), వెంకటేష్ అయ్యర్ (9) కూడా ఫెయిలయ్యారు.
కోల్‌కతా సారథి నితీష్ రానా (57), పించ్ హిట్టర్ రింకూ సింగ్ (54) మాత్రం హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆండ్రీ రస్సెల్ (2)తో కలసి నితీష్.. కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. సీఎస్కే బౌలర్లలో చాహర్ ఒక్కడే మూడు వికెట్లతో రాణించాడు. మిగతా వాళ్లందరూ వికెట్లు పడగొట్టడంలో ఫెయిలయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్లు మొయిన్ అలీ, మహీష తీక్షణ, రవీంద్ర జడేజాలు కలసి 9 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. చెన్నై జట్టు స్పిన్నర్లు చెపాక్ స్టేడియంలో ఇన్నేసి ఓవర్లు బౌలింగ్ చేసి కనీసం ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇదే తొలిసారట. ప్లేఆఫ్స్‌లో ఓ క్వాలిఫైయర్, ఒక ఎలిమినేటర్ మ్యాచ్ చెపాక్‌లోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్పిన్ మంత్రం బెడిసికొట్టడంతో సీఎస్కే సారథి ధోనీకి కొత్త కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. సొంత మైదానంలో స్పిన్నర్లు ఇలా ఫెయిలైతే.. ప్లేఆఫ్స్‌లో తీవ్ర ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. మరి.. ఈ సమస్యను ధోని ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.