సన్ రైజర్స్ ఆటగాడు నటరాజన్ కూతురు హన్వికతో సందడి చేశాడు ధోని. ఈ క్రమంలో ఈ బుడ్డది మిస్టర్ కూల్ ధోనికే షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేంద్ర సింగ్ ధోని పేరు వినగానే వరల్డ్ బెస్ట్ ఫినిషర్, మిస్టర్ కూల్, జార్ఖండ్ డైనమెట్.. మనకు గుర్తుకు వచ్చే పేర్లు. కానీ ధోనిలో చాలా మందికి తెలియని ఓ కోణం ఉంది. అది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే బయటకి తీస్తాడు మిస్టర్ కూల్. ఇక ధోనిలో తెలియని కోణం ఏంటి అంటే చిన్న పిల్లలతో ఆడుకోవడం, వారిని ఆటపట్టించడం, వారిని నవ్వించడం. కొన్ని రోజుల క్రితమే క్రిష్ణప్ప గౌతమ్ కూతురితో హై ఫైవ్ చేసి, ముచ్చటించాడు ధోని. తాజాగా మరో క్రికెటర్ కూతురితో కలిసి సందడి చేశాడు. శుక్రవారం రాత్రి చెన్నై-సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. సన్ రైజర్స్ ఆటగాడు నటరాజన్ కూతురు హన్వికతో నవ్వులు చిందించాడు ధోని. ఈ క్రమంలోనే ఆ పాప ధోనికి గట్టి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా శుక్రవారం చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ధోని జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై టీమ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో.. SRH టీమ్ ను ఓడించింది. ఇక మ్యాచ్ అనంతరం మైదానంలో ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది.ఈ దృశ్యంలో ధోని ఉన్నప్పటికీ హైలెట్ అయ్యింది మాత్రం SRH ప్లేయర్ నటరాజన్ కుతురు హన్విక అనే చెప్పాలి. మ్యాచ్ ముగిశాక అందరిని కలుస్తూ.. నటరాజన్ దగ్గరికి వచ్చాడు ధోని.
ఇక అక్కడే నటరాజన్ కుతురిని ఎత్తుకుని భార్యతో కలిసి ఉన్నాడు. ధోని వచ్చి సరాసరి నటరాజన్ కూతురికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ హన్విక మాత్రం తన చేతిని ఇవ్వలేదు. దాంతో హై ఫైవ్ అంటూ ధోని చేతిని చూపాడు.. ఈసారి బుడ్డది ఏకంగా తన చేతులను వెనక్కి లాక్కుంది. దాంతో నవ్వులు చిందించాడు ధోని. ఆ తర్వాత ఈ పాప తంబి అని, మామ అని ధోనిని పిలిచింది. పాప మెుహం వెరీ షైనింగ్ అంటూ నటరాజన్ తో చెప్పాడు ధోని. అనంతరం అందరు కలిసి ఓ ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ధోని చిన్న పిల్లల మనస్తత్వం గలవాడని ప్రశంసిస్తున్నారు.
Cutest video of the day.
Dhoni with the daughter of Natarajan.pic.twitter.com/p5P0RSqEDU
— Johns. (@CricCrazyJohns) April 22, 2023