MS Dhoni: కెప్టెన్‌గా టీమిండియాకు ఎంతో చేసిన ధోని.. త్వరలోనే హెడ్ కోచ్‌గా టీమిండియాను ముందుకు నడిపిస్తాడనే ప్రచారం చాలా రోజులనుంచి జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారానికి టీమిండియా మాజీ క్రికెటర్ మద్దతు తెలిపారు.
మహేంద్రసింగ్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్. ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత.. ఐపీఎల్‌లో ఆడుతున్న ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ను సైతం విజయపథంలో నడిపిస్తున్నాడు. అయితే.. ఇదే ధోనికి చివరి ఐపీఎల్‌గా చెప్పుకుంటున్నా.. మరీ ధోని మనుసులో ఏం ఉందో ఎవరికీ తెలియదు. మహా అయితే మరో ఏడాది ఐపీఎల్ ఆడే అవకాశం ఉంది. అయితే.. క్రికెట్‌కు ధోని పూర్తిగా గుడ్‌బై చెప్పిన తర్వాత టీమిండియాలో పెద్ద బాధ్యతలు చేపడతాడనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.
ఈ ప్రచారానికి భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బలం చేకూర్చారు. టీమిండియా హెడ్ కోచ్‌గా ధోనీని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకోవచ్చని గవాస్కర్ పేర్కొన్నారు. ధోనీకి హెడ్ కోచ్ బాధ్యతలను బీసీసీఐ అప్పగిస్తుందని తాను బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ధోని క్రికెట్ నుంచి పూర్తిస్థాయిలో తప్పుకొన్న తరువాత కీలకమైన బాధ్యతలు అతనికి అప్పగించే అవకాశం ఉన్నట్లు గవాస్కర్ తెలిపారు. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్, టీమ్‌కు హెడ్ కోచ్, కోచింగ్ స్టాఫ్ హెడ్ వీటిలో ఏదో ఒక పదవిని ధోనికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ధోని హెడ్ కోచ్‌గా ఉంటే అతని విలువైన సూచనలు, సలహాలు, లీడర్ షిప్ క్వాలిటీస్.. టీమిండియా యువ క్రికెటర్లకు ఉజ్వల భవిష్యత్‌ను చూపుతాయని, ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుందని సునీల్ గవాస్కర్ అన్నారు. కాగా గతంలో ధోని టీమిండియాకు మెంటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2021ను ఆడిన భారత జట్టుకు ధోని మెంటార్‌గా ఉన్నారు. కానీ, తొలి ప్రయత్నంలో ధోని విఫలం అయ్యాడు. జట్టును సెమీ ఫైనల్స్ వరకు కూడా తీసుకెళ్లలేకపోయాడు. మరి హెడ్ కోచ్ పదవి వస్తే.. ఎంత వరకు విజయవంతం అవుతాడో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sunil Gavaskar on Dhoni. #sunilgavaskar #Msdhoni #indiancricketteam #Dhoni pic.twitter.com/6pLzB6iK1u
— RVCJ Sports (@RVCJ_Sports) May 4, 2023