చెన్నై సూపర్ కింగ్స్ మరో ఐపీఎల్ కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే నాలుగుసార్లు ఈ ట్రోఫీని చేతబట్టిన సీఎస్కే.. ఐదో టైటిల్‌ను గెలుచుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్-2023 ఫైనల్లో సీఎస్కే విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డు సృష్టించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఐదు టైటిల్స్ గెలిచిన రెండో జట్టుగా సీఎస్కే అవతరించింది. ఐదు టైటిల్స్ నెగ్గిన ముంబై రికార్డును ధోని సేన సమం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చివరి బాల్‌కు ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠ తీవ్రస్థాయికి చేరుకున్న తరుణంలో ఆఖరి రెండు బాల్స్‌ను సిక్స్, ఫోర్‌గా మలచిన రవీంద్ర జడేజా చెన్నైకు చిరస్మరణీయ విజయంతో పాటు కప్‌ను అందించాడు. దీంతో అతడ్ని ఎత్తుకొని ధోని సంబురాలు చేసుకున్నాడు. తనకు ఇదే ఆఖరి సీజన్‌గా అభిమానులు భావిస్తున్న నేపథ్యంలో వారికి మిస్టర్ కూల్ గుడ్‌న్యూస్ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కామెంటేటర్ హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు అతడు బదులిచ్చాడు.
రిటైర్మెంట్పై ప్రకటన చేయడానికి ఇంకా టైమ్ ఉందని ధోని అన్నాడు. ఈ ఏడాది తాను ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల నుంచి భారీగా ప్రేమాభిమానాలను పొందానని.. ఇలాంటప్పుడు అందరికీ కృతజ్ఞతలు చెప్పడం సులువని ధోని చెప్పాడు. ‘ఈ సీజన్లో మా టీమ్ ఆడిన ప్రతిచోట ఆడియెన్స్ నుంచి పెద్ద ఎత్తున నేను ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నా. అందుకు వారికి థ్యాంక్స్ చెప్పడం సులువే. వారికి నేను తప్పకుండా గిఫ్ట్ ఇవ్వాలి. నేను మరో సీజన్ ఆడటం అంత ఈజీ కాదు. కానీ వచ్చే 9 నెలలు బాగా శ్రమించి నెక్స్ట్ సీజన్ ఆడాలి. ఇదంతా నా బాడీపై ఆధారపడి ఉంటుంది. దీనిపై కచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు మరో ఆరేడు నెలల టైమ్ ఉంది. ట్రోఫీని మా టీమ్ నాకు బహుమతిగా ఇచ్చింది. నా మీద వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు.. నేను చేయాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలి ఉన్నాయనిపిస్తోంది’ అని ధోని వివరించాడు.
MS Dhoni said, “I need to give them a gift. It won’t be easy for me for one more season, but I’ll work best”. pic.twitter.com/S31hYVQ89o
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023