టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని అనుకుంటే 100 టెస్టులు ఆడేవాడని రవిశాస్త్రి అన్నాడు. ఒకే ఒక కారణం వల్ల అతడు రిటైర్మెంట్ ప్రకటించాడని ఆయన తెలిపాడు.
క్రికెట్‌కు భారత్ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక బ్యాట్స్‌మన్‌గా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని.. కెప్టెన్‌గా టీమిండియాకు అద్భుత విజయాలు అందించాడు. సుదీర్ఘ కాలంగా అందని ద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌ను కూడా టీమిండియాకు అందించాడు. అయితే 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడీ లెజెండరీ ప్లేయర్. అప్పటినుంచి కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెబుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ మీద టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దేశంలో చాలా మంది యంగ్ వికెట్ కీపర్లకు ధోనీనే మార్గదర్శి అని రవిశాస్త్రి చెప్పాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే గొప్ప వికెట్ కీపర్‌గా ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాడని ధోనీపై ప్రశంసల జల్లులు కురిపించాడు. ధోని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోడని.. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అవుతుందన్నాడు. ‘ఇంకో ఏడాది ఆడే అవకాశం ఉన్నప్పటికీ టెస్టు క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలికాడు. అతడు గణాంకాల కోసం చూసే ప్లేయరైతే.. 100 టెస్టుల మార్క్‌ను దాటాక గుడ్‌బై చెప్పే ఛాన్స్ ధోనీకి ఉంది. భారీ ప్రేక్షకుల మధ్య ఘనంగా వీడ్కోలు ఇవ్వొచ్చు. అందరూ కోరుకునే విధానంలో కాకుండా చాలా సింపుల్‌గా ధోని నిర్ణయాన్ని వెల్లడించాడు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తన స్థానంలో ఇతరులకు అవకాశం ఇవ్వాలనే కారణంగానే 2014లోనే ధోని టెస్టుల నుంచి తప్పకున్నాడని చెప్పుకొచ్చాడు.
Ravi Shastri clarified that once MS Dhoni made up his mind of quitting Test cricket, there was no way back for him.#CricketTwitter https://t.co/ueqJ1MGk6h
— CricTracker (@Cricketracker) April 29, 2023