MS Dhoni, IPL 2023: ఐపీఎల్ లో ధోని ఓవరాల్ గా 237 మ్యాచ్ లు ఆడాడు. ఇక కెప్టెన్ గా 207 మ్యాచ్ లు ఆడిన ధోని..123 మ్యాచ్ ల్లో జట్టుని గెలిపించాడు. 2010, 2011, 2018, 2021 సీజన్లలో సూపర్ కింగ్స్ జట్టుకి టైటిళ్లు అందించాడు. కెప్టెన్ గా 9 సార్లు చెన్నై జట్టుని ఫైనల్ కి చేర్చిన ఘనత ధోనికి మాత్రమే ఉంది.
15 సీజన్లు, 4 టైటిళ్లు, 9 సార్లు ఫైనల్, 4 వేలకు పైగా పరుగులు. కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు, ఎన్నో ఘనతలు, మరెన్నో రికార్డులు.. ఇది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్థానం. ఐపీఎల్‌లో ఎంతమంది కెప్టెన్ లు ఉన్నా.. మహేంద్రుడి స్థానం ప్రత్యేకం. టీమిండియాకే కాదు ఐపీఎల్ లో కూడా చెన్నై జట్టుని సమర్థవంతంగా నడిపిన నాయకుడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకున్న మహేంద్రుడు.. తాజాగా మరొక అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. కెప్టెన్ గా ఇప్పటివరకు ఎవ్వరు సాధించని రికార్డుని ఈ రోజు రాజస్థాన్ మ్యాచ్ ద్వారా మిస్టర్ కూల్ అందుకోనున్నాడు. ఇంతకీ ధోని సాధించబోయే ఈ రికార్డ్ ఏంటి?
2008లో తొలి సారి ఐపీఎల్ వేలం నిర్వహించగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 కోట్లకు మహేంద్ర సింగ్ ధోనిని దక్కించుకుంది. ఈ సీజన్లో ఒక ప్లేయర్ కి చెల్లించిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. ఇక ఈ సీజన్ మొదలుకొని ప్రస్తుత సీజన్ వరకు ధోనినే చెన్నై కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. మధ్యలో 2106, 2017 సీజన్లు చెన్నై టీమ్ ని నిషేధించడంతో రైజింగ్ పూణే జట్టుకి ఆడాడు. చెన్నై అంటే ధోని. ధోని అంటే చెన్నై అనేలా ఉంది ఈ మిస్టర్ కూల్ ఫాలోయింగ్. తనదైన బ్యాటింగ్ తో, కెప్టెన్సీతో చెన్నై టీమ్ కి ఎన్నో మరపురాని విజయాలందించాడు. ఇప్పటివరకు 199 మ్యాచ్ లు చెన్నై జట్టుకి సారధ్యం వహించిన ధోని.. నేడు రాజస్థాన్ తో జరగబోయే మ్యాచ్ 200 వది కావడం విశేషం. సొంతగడ్డపై ఈ మైల్ స్టోన్ అందుకోనుండడం అభిమానులు ఫుల్ కిక్కిస్తుంది.
ఇక ఐపీఎల్ లో ధోని ఓవరాల్ గా 237 మ్యాచ్ లు ఆడాడు. ఇక కెప్టెన్ గా 207 మ్యాచ్ లు ఆడిన ధోని..123 మ్యాచ్ ల్లో జట్టుని గెలిపించాడు. 2010, 2011, 2018, 2021 సీజన్లలో సూపర్ కింగ్స్ జట్టుకి టైటిళ్లు అందించాడు. కెప్టెన్ గా 9 సార్లు చెన్నై జట్టుని ఫైనల్ కి చేర్చిన ఘనత ధోనికి మాత్రమే ఉంది. ఇక చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ రోజు మ్యాచ్ లో ధోని సేన మరో విజయం అందుకోవాలని చూస్తుంది. ఇప్పటికే వరుస విజయాలు అందుకొని జోరు మీదున్న చెన్నై టీమ్ ని రాజస్థాన్ ఏ మాత్రం నిలువరిస్తుందో చూడాలి. మొత్తానికి ఓ వైపు చెన్నై మ్యాచ్, మరోవైపు ధోని రికార్డ్ తో అభిమానులకి ఈ రోజు పండగే అని తెలుస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Everytime MS Dhoni steps on the pitch, there’s a record made. As he leads Chennai Super Kings against Rajasthan Royals #IPL2023 today, Dhoni will mark his 200th appearance as their skipper in the tournament. THE GOAT of IPL . #CSKvsRR #IPL2033 pic.twitter.com/JylfSiobQc
— Ridhima Pathak (@PathakRidhima) April 12, 2023