సీఎస్కే సారథి ధోని ఒకప్పుడు పించ్ హిట్టింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. అతడు బ్యాట్ ఊపితే బాల్ ఫోర్ లేదా సిక్స్ పోవాల్సిందే. ఆ తర్వాత మాత్రం ధోని నెమ్మదించాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆడటం అలవాటు చేసుకున్నాడు. అయితే బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని హిట్టింగ్ చేయడం చూస్తే అతడిలో మునుపటి వాడివేడి ఇంకా తగ్గలేదనిపిస్తోంది.
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్తోంది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 27 రన్స్ తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఆ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ ఝలిపించాడు. సీఎస్కే 126 రన్స్‌కు ఆరు వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన ధోని.. వింటేజ్ మాహీని గుర్తుచేశాడు. తక్కువ సేపే క్రీజులో ఉన్నా రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో అభిమానులకు మస్తు వినోదాన్ని పంచాడు. అతడి మెరుపుల కారణంగా సీఎస్కే 167 రన్స్ చేసింది. ఆ తర్వాత బౌలర్లు రాణించడంతో మ్యాచ్‌ను గెలుచుకుంది. చెన్నై ఇన్నింగ్స్‌లో ధోని బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. అయితే మోకాలి గాయం కారణంగా వికెట్ల మధ్య సరిగ్గా పరిగెత్తలేకపోయాడు ధోని.
ధోని గాయం గురించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తే ధోనీని అలా కుంటుతూ ఉరకడం చూసి తన హృదయం ముక్కలైందని పఠాన్ అన్నాడు. మ్యాచ్ అనంతరం ధోనీని హత్తుకున్న ఫొటోలను పంచుకున్న పఠాన్.. తనకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయంటూ ట్వీట్ చేశాడు. తాము ఎప్పుడు కలసినా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటామని పఠాన్ చెప్పుకొచ్చాడు. కాగా, ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గతంలో వెల్లడించిన విషయం విదితమే. గాయాలైనా, శరీరం సహకరించకున్నా చెన్నై కోసం నొప్పిని భరిస్తూ ఆడుతున్న ధోనీని అందరూ అభినందిస్తున్నారు. అతడిలా మరెవ్వరూ చేయలేరని, ధోని గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు. కాగా, ధోని గాయం తీవ్రత ఎంతనేది ఇంకా తెలియలేదు. ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ప్లేఆఫ్స్‌లో సీఎస్కేకు ఇబ్బందులు తప్పకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
Seeing Dhoni limping thru running between the wickets breaks my heart. Have seen him run like a cheetah.
— Irfan Pathan (@IrfanPathan) May 10, 2023
Jaha se chorte hai wahi se fir se shuru hoti hai Hamari dosti. Never been a time where we met and didn’t remember our good old days. Some funny memories comes back to the life every time we meet. @msdhoni @ChennaiIPL #leader #friend pic.twitter.com/R2XkrLUrEq
— Irfan Pathan (@IrfanPathan) May 11, 2023