క్రికెట్ లో ధోని కోపం తెచ్చుకున్న సందర్భాలు ఒకటో రెండో మినహా ఎంత వెతికినా కనపడవు. అయితే చాలా కాలం తర్వాత ధోనికి మరొకసారి కోపం వచ్చింది. కారణం ఏమిటంటే ?
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది అతనిలోని ప్రశాంతత. ఎంత ఒత్తిడిలోనైనా ఎలాంటి ఎమోషన్స్ కి లోను కాకుండా కూల్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే అందరూ ధోనిని “మిస్టర్ కూల్” అని పిలుచుకుంటారు. అయితే క్రికెట్ లో ధోని కోపం తెచ్చుకున్న సందర్భాలు ఒకటో రెండో మినహా అసలు కనపడవు. ఇటీవలే భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన మొత్తం కెరీర్ లో ధోని కేవలం రెండు సార్లు మాత్రమే కోపం ప్రదర్శించాడు అంటే అర్ధం చేసుకోవచ్చు అతని కూల్ నెస్ ఎలాంటిదో. అయితే చాలా కాలం తర్వాత ధోనికి మరొకసారి కోపం వచ్చింది.
ఐపీఎల్ లో నిన్న జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో ధోని సేనపై విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా ధోని బౌలర్ పతిరానాపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇన్నింగ్స్ 16 వ ఓవర్ వేయడానికి పతిరాన బౌలింగ్ కి వచ్చాడు. ఈ ఓవర్ మూడో బంతికి హెట్ మేయర్ షాట్ కి ప్రయత్నించగా అది కాలికి తగిలి ధోని వైపుగా వెళ్ళింది. హెట్ మేయర్ పరుగు కోసం వెళ్తుండగా ధోని బంతిని నాన్ స్ట్రైకింగ్ వైపుగా విసిరాడు. అయితే పిచ్ మధ్యలో ఉన్న పతిరానా ఆ బంతి పెట్టుకొనేందుకు ప్రయత్నించగా రనౌట్ ఛాన్స్ మిస్సయింది. పతిరానా ఆ బంతిని అడ్డుకోకపోతే హెట్ మేయర్ ఔటయ్యేవాడు. దీంతో ధోని పతిరానా వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేసాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
సాధారణంగా ధోనికి కోపం రాదు. కానీ నిన్న మ్యాచులో పతిరానాపై ధోని తన సహనాన్ని కోల్పోవడంతో అందరూ చాలా కాలం తర్వాత ధోనిలో కోపం చూసారు. ఇక ఈ మ్యాచ్ విషయాన్నికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్ 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ జైస్వాల్(77) చెలరేగి హాఫ్ సెంచరీ చేయగా మిగిలిన వారు తలో చేయి వేశారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో చెన్నై ఏ దశలోనూ పోటీని ఇవ్వలేకపోయింది. గైక్వాడ్(47) దూబే(52) పోరాడినప్పటికే అది చెన్నై విజయానికి ఏ మాత్రం సరిపోలేదు. దీంతో చెన్నై 170 పరుగులకే పరిమితమైంది. మొత్తానికి ఏ మ్యాచులో చాలా రోజుల తర్వాత ధోనిలోని కోపాన్ని చూసాం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.