భారత క్రికెట్ లో ధోని, కోహ్లీ అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భిన్న ధ్రువాల్లాగా కనబడే వీరి రిలేషన్ ముచ్చట గొలిపేలా ఉంటుంది. ఇక తాజాగా కెప్టెన్ ధోని డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ గురించి మాట్లాడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన కొన్ని సెకన్ల వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
భారత క్రికెట్ లో ధోని, కోహ్లీ అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భిన్న ధ్రువాల్లాగా కనబడే వీరి రిలేషన్ ముచ్చట గొలిపేలా ఉంటుంది. ఒకరు కూల్ గా ఉంటూ భారీ అభిమానుల్ని సొంతం చేసుకుంటే.. మరొకరు అగ్రెస్సివ్ నెస్ తో తనకంటూ ప్రేత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. వీరిద్దరూ గ్రౌండ్ లో కలిస్తే అభిమానులకి కన్నుల పండుగే. ఇటీవలే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ కనిపించిన వీడియో అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా కెప్టెన్ ధోని డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ గురించి మాట్లాడుతూ కనిపించాడు.
ఐపీఎల్ లో భాగంగా గత శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన ధోని సేన ముంబైపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో 2011 తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ని ఓడించించడం విశేషం. ఈ మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూమ్ లో ఆటగాళ్ల బ్యాటింగ్ టెక్నీక్ ఉద్దేశించి ధోని మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లీ ప్రస్తావన రావడం గమనార్హం.
ధోని పూర్తిగా ఏం చెప్పాడనే విషయంలో క్లారిటీ లేకపోయినా.. ఇందుకు సంబంధించిన కొన్ని సెకన్ల వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ధోని మాటలను గమనిస్తే “విరాట్ తన తొలి బంతిని ఇలా ఆడడు, బ్యాట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది”. అనే మాట్లాడు ధోని చెప్పాడని అర్ధం అవుతుంది. కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ గురించి చెబుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో అదరగొడుతున్న చెన్నై జట్టు 11 మ్యాచుల్లో 6 విజయాలతో మొత్తం 13 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొత్తానికి కోహ్లీ ప్రస్తావన తీసుకొచ్చి వారిద్దరి బంధం ఎంత బలమైనదో ధోని చెప్పకనే చెప్పాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Dhoni talking to one of the CSK members by mentioning the name of Virat Kohli. pic.twitter.com/8Y09cWMvLw
— Johns. (@CricCrazyJohns) May 6, 2023