చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ టోర్నీలో బాగానే రాణిస్తున్నాడు. అయితే అతడికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. చెన్నై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ అతడికో సమస్య తప్పడం లేదు. అదేంటంటే..!
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకెళ్తోంది. వరుస విజయాలతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. చెపాక్ వేదికగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 27 రన్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 రన్స్ చేసింది. ఆ జట్టులో ఎవరూ భారీ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే (25)దే హయ్యెస్ట్ స్కోరు. అయితే చివర్లో సారథి ఎంఎస్ ధోని (9 బాల్స్‌లో 20) మెరుపులు మెరిపించడంతో చెన్నై మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కలేదు. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మనీష్ పాండే (27), రోసో (35) రాణించినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయ్యారు. దీంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.
ఇకపోతే చెన్నై బ్యాటింగ్ సమయంలో జరిగిన ఒక ఘటన హాట్ టాపిక్‌గా మారింది. జడేజా 7 రన్స్ దగ్గర ఉన్న సమయంలో ప్రేక్షకులు మాహీ భాయ్ అంటూ అరిచారు. దీనిపై మ్యాచ్ అనంతరం జడేజా స్పందించాడు. ధోని త్వరగా క్రీజులోకి రావాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారని జడ్డూ అన్నాడు. తాను త్వరగా ఔట్ అవ్వాలనేది వారి కోరిక అని చెప్పుకొచ్చాడు. చెన్నై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ జడేజాకు ఇదే సమస్య ఎదురవుతోంది. జడేజా తర్వాత ధోని క్రీజులోకి వస్తాడు. దీంతో మ్యాచ్ పరిస్థితులతో సంబంధం లేకుండా ధోని బ్యాటింగ్ చూడాలనే ఉత్సాహంతో ప్రేక్షకులు జడ్డూ ఔట్ అవ్వాలని కోరుకుంటున్నారు. దీంతో అతడు కాస్త నిరాశకు లోనవుతున్నాడు. ఇది మున్ముందు సీఎస్కే మ్యాచ్‌లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
Jadeja said “When I bat at 7, the crowd is disappointed and chants for Mahi bhai, imagine if I bat higher, they will just wait for me to get out (big smile)”. pic.twitter.com/qDP5Ehk4ND
— Johns. (@CricCrazyJohns) May 10, 2023