MS Dhoni: ధోని మూడింటిలోనూ తోపే. అసలు ఆ ప్రశ్న వేసిన వారికే బుద్ధిలేదు అనే స్థాయిలో ధోని అభిమానుల రియాక్షన్ ఉండేది. కానీ.. ఇప్పుడు కాలం మారింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎలాంటి ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు ఎంతో చేశాడు. మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్ ధోని. అలాగే ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏకంగా నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే.. ధోని టీమ్‌లో ఉంటే మూడు లాభాలు ఉంటాయి. అవి ఏంటంటే.. బ్యాటర్ రూపంలో ఒక బెస్ట్ ఫినిషర్, అద్భుతమైన వికెట్ కీపర్‌తో పాటు అంతచిక్కని వ్యూహాలను వికెట్ల వెనుక నుంచే మ్యాచ్‌ను గెలిపించగలిగే మాస్టర్‌మైండ్ కెప్టెన్. ఇలా మూడు రోల్స్‌లో ధోని ది బెస్ట్ క్రికెటర్.
అయితే.. ధోని పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ మూడు విభాగాల్లో ఎందులో ధోని బెస్ట్ అని అనుకుంటున్నారని అభిమానులను అడిగితే.. వాళ్లు చెప్పడం కష్టంగా మారేది. ఎందుకంటే ధోని మూడింటిలోనూ తోపే. అసలు ఆ ప్రశ్న వేసిన వారికే బుద్ధిలేదు అనే స్థాయిలో ధోని అభిమానుల రియాక్షన్ ఉండేది. కానీ.. ఇప్పుడు కాలం మారింది. బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీ వీటిలో ఒక టీమ్‌కు ధోని అవసరం ఎందులో ఉందని చెప్తే.. నిర్మోహమాటంగా కెప్టెన్సీకే అని బల్లగుద్ది చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో ధోని ఏ రోల్‌లో వ్యాల్యూబుల్‌గా ఉన్నాడని అడిగిన ప్రశ్నకు క్రికెట్ అభిమానులు కెప్టెన్సీకి 76 శాతం, వికెట్ కీపింగ్‌కి 18 శాతం, బ్యాటింగ్‌కి 6 శాతం ఓట్లు వేశారు.
దీంతో.. సీఎస్‌కేకు ధోని జెస్ట్ కెప్టెన్‌గా ఉంటే చాలాని ధోని అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటర్‌గా ధోని నుంచి వారు పెద్దగా ఏమీ ఆశించడం లేదని స్పష్టం అవుతుంది. కానీ.. ధోని చివర్లో బ్యాటింగ్‌కి వస్తూ.. భారీ సిక్సులు బాదుతున్నాడు. అయితే.. ఇదే ధోనికి చివరి ఐపీఎల్ అనే ప్రచారం జరుగుతున్నా.. ధోని మాత్రం ఆ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. నాకు ఇదే చివరి ఐపీఎల్ అని మీరు అంటున్నారు నేను కాదు అని ఇటివల ఓ కామెంటర్‌కు ధోని బదులు ఇచ్చాడు. మరి ధోని బ్యాటింగ్ విషయంలో క్రికెట్ అభిమానులు ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni’s most valuable role to CSK is captaincy says 76% of people. pic.twitter.com/geSIXrhHOE
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2023