సహచర ప్లేయర్ ని సపోర్ట్ చేయడం చాలా ముఖ్యం. కానీ ఇది కొన్ని విషయాల్లో మాత్రమే వర్తిస్తుంది. తప్పు ఎవరిదైనా పట్టించుకోకుండా నేను బ్లైండ్ గా సపోర్ట్ చేస్తానంటే విమర్శలు తప్పవు. అలాంటి సంఘటనే నిన్న ఐపీఎల్ లో ఒకటి జరిగింది.
సహచర ప్లేయర్ ని సపోర్ట్ చేయడం చాలా ముఖ్యం. కానీ ఇది కొన్ని విషయాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఆటగాడు ఫామ్ లో లేనప్పుడు స్వేచ్ఛనివ్వడం,టాలెంట్ క్రికెటర్లను ప్రోత్సహించడం, తప్పు లేకుండా ఎవరైనా స్లెడ్జింగ్ చేసినప్పుడు వారికి అండగా నిలబడితే అందులో ఒక అర్ధం ఉంది. కానీ తప్పు ఎవరిదైనా పట్టించుకోకుండా నేను బ్లైండ్ గా సపోర్ట్ చేస్తానంటే విమర్శలు తప్పవు. అలాంటి సంఘటనే నిన్న ఐపీఎల్ లో ఒకటి జరిగింది. మాజీ ఆర్సీబీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి .. ఫాస్ట్ బౌలర్ సిరాజ్ పరోక్షంగా మద్దతు తెలుపుతూ కాస్త ఓవరాక్షన్ చేస్తూ కనిపించాడు.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూకుడు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా కయ్యానికి కాలు దువ్వితే విరాట్ అస్సలు వదలడు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు మనం చూసేసాం. అయితే కోహ్లీ అడుగు జాడల్లోనే బౌలర్ సిరాజ్ మరింత దూకుడుని చూపిస్తూ కాస్త హద్దు మీరు ప్రవర్తిస్తున్నాడు. నిన్న జరిగిన మ్యాచును గమనిస్తే లక్నో ఇన్నింగ్స్ 17 ఓవర్లో కోహ్లీకి, అఫ్గాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ కి చిన్న మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇది మనసులో పెట్టుకున్న సిరాజ్ ఈ ఓవర్ చివరి బంతికి నవీన్ ని టార్గెట్ చేసాడు.
నవీన్ క్లియర్ గా గ్రీజ్ లో బ్యాట్ ఉంచినా.. సిరాజ్ నవీన్ కెళ్ళి కోపంగా చూస్తూ కావాలనే వికెట్లను బంతితో కొట్టాడు. దీంతో ఇద్దరు కాసేపు అలాగే చూసుకున్నారు. ఈ సమయంలో సిరాజ్ చేష్టలు కాస్త వికృతంగా అనిపించాయి. విరాట్ కోహ్లీ జోలికివస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని కళ్ళతో చెప్పకనే చెప్పాడు. దీంతో ఇప్పుడు ఈ ఫాస్ట్ బౌలర్ చేసిన పనికి అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. బౌలింగ్ ఎంత బాగా వేస్తే మాత్రం ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. క్రికెట్ అంటే కేవలం ఆటకు ప్రదర్శనే కాదు. వ్యక్తిగతంగా కూడా మంచిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాగైతేనే క్రికెట్ లో రాణించగలుగుతారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Never mess with hyderabadi 😂🤙#mohammedsiraj #LSGvsRCB pic.twitter.com/xAU9tPWT71
— itz.shazeb (@ItzShazebKhan) May 1, 2023