మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అతను ఐపీఎల్లో కూడా అదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే సూర్యకు అవకాశాలు రావడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సూర్యకుమార్ కు టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ మహ్మద్ కైఫ్ అండగా నిలిచాడు.
సూర్య కుమార్ యాదవ్.. ఇతను ఎంత డేంజరెస్ ప్లేయరో వరల్డ్ టాప్ బౌలర్లను అడిగితే చెబుతారు. ఈ మిస్టర్ 360 ప్లేయర్ ఇప్పుడు కెరీర్ లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నుంచి సూర్య కుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ లో కూడా సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లోకి రాలేకపోతున్నాడు. ఐపీఎల్ లో కూడా సూర్య కుమార్ యాదవ్ ని డకౌట్లు వెంటాడుతున్నాయి. ఆడిన 3 మ్యాచుల్లో స్కై చేసింది కేవలం 16 పరుగులు మాత్రమే. ఇప్పటికే సూర్య కుమార్ యాదవ్ పై విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం సూర్యకు మద్దతుగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఆ లిస్టులోకి మహ్మద్ కైఫ్ చేరాడు.
సూర్య కుమార్ యాదవ్ ఆస్ట్రేలియా సిరీస్ లో విఫలమైన తర్వాత రోహిత్ శర్మ అతనికి మద్దతుగా నిలిచాడు. స్కై తప్పుకుండా ఫామ్ లోకి వస్తాడంటూ భరోసాగా నిలిచాడు. అయితే ఐపీఎల్ లో కూడా సూర్య దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పుడు ఆ విమర్శలు మరింత ఊపందుకున్నాయి. ఎందుకు సూర్యకు అవకాశాలు ఇస్తున్నారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ కి టీమిండియా స్టార్ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు. సూర్య కుమార్ ఫామ్ గురించి ఎందుకు అంత భయ పడుతున్నారంటూ ప్రశ్నించాడు. అతను ఇంకో 12 సార్లు డకౌట్ అయినా కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ కైఫ్ చెప్పుకొచ్చాడు.
“సూర్య కుమార్ ఫామ్ విషయంలో ఎందుకు అంత చర్చ. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ గడ్డపై ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన ఆటగాడు సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్ ఒక గొప్ప ఆటగాడని అందరికీ తెలుసు. అతను నాలుగుసార్లు డకౌట్ అయినంతమాత్రాన ఏం ఫరక్ పడదు. అతను ఇంకో 12సార్లు డకౌట్ అయినా అతనికి అవకాశం ఇవ్వచ్చు. ప్రతి క్రికెటర్ కెరీర్ లో ఇలాంటి ఒక దశ తప్పుకుండా ఉంటుంది. సూర్య ఫామ్ తాత్కాలికం.. తని క్లాస్ మాత్రం శాశ్వతం అని గుర్తుంచుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో యాజమాన్యం, జట్టు అతనికి మద్దతుగా నిలిస్తే తరిగి తప్పకుండా ఫామ్ లోకి వస్తాడు” అంటూ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు. సూర్య కుమార్ కు అవకాశాలు ఇవ్వడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.