ధోనికి ప్రపంచవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అభిమానులున్నారని అందరికీ తెలిసిందే. కానీ వీటన్నిటికీ మించి తమిళనాడులో ధోని క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇక్కడ కేవలం అభిమానుల కంటే.. ఆరాధించేవారే ఎక్కువగా ఉన్నారు. ఇంత అభిమానాన్ని దక్కించుకున్న ధోనికి ఇప్పుడు ఏకంగా తమిళనాడు సీఎం కరుణానిధి స్టాలిన్ కూడా అభిమానిగా మారిపోయాడు.
“రాజు ఎక్కడున్నా రాజే ” బాహుబలి సినిమాలో ప్రభాస్ ని ఉద్దేశించి నాజర్ చెప్పే డైలాగ్. అయితే రీల్ లైఫ్ లో డార్లింగ్ ప్రభాస్ కి ఈ డైలాగ్ ఎంత బాగా సూట్ అయిందో.. రియల్ లైఫ్ లో మహేంద్రసింగ్ ధోనికి అలాగే సూటవుతుంది. ప్రస్తుతం ఇదే మహేంద్రుడి చివరి ఐపీఎల్ అని అందరూ భావిస్తున్న తరుణంలో మిస్టర్ కూల్ ఎక్కడ చేరితే అభిమానులు అక్కడ వాలిపోతున్నారు. ఒకప్పుడు చెన్నైలో మాత్రమే ఎల్లో కలర్ తో హోరెత్తగా.. ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్లినా ధోని హవానే. చెన్నై మ్యాచ్ ఆడుతుందంటే.. బెంగళూరు, ముంబై, జైపూర్ లాంటి సిటీలో కూడా ధోని ఫ్యాన్స్ తో స్టేడియం నిండిపోతున్నారు. ఇంత అభిమానాన్ని దక్కించుకున్న ధోనికి ఇప్పుడు ఏకంగా తమిళనాడు సీఎం కరుణానిధి స్టాలిన్ కూడా అభిమానిగా మారిపోయాడు.
ధోనికి ప్రపంచవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అభిమానులున్నారని అందరికీ తెలిసిందే. కానీ వీటన్నిటికీ మించి తమిళనాడులో ధోని క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇక్కడ కేవలం అభిమానుల కంటే.. ఆరాధించేవారే ఎక్కువగా ఉన్నారు. దానికి కారణం ఏంటో మనందరికీ తెలిసిందే. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆడడమే ధోని క్రేజ్ ని అమాంతం పెంచేసింది. ఒకవేళ ధోని వేరే జట్టుకి ఆడితే ఇంత క్రేజ్ ఉంటుందా ? అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి నచ్చితే తమిళ ప్రజలు వారిని ఆకాశానికెత్తేస్తారు. నచ్చిన హీరోలకు భారీ ఎత్తున కటౌట్ లు, హీరోయిన్లకు గుడి కట్టించడాలు లాంటివి తమిళ తంబీలకు సాధ్యం.
చెన్నై సూపర్ కింగ్స్ తో ధోని ప్రయాణం ఇప్పటిది కాదు. 2008 నుంచి ఇప్పటివరకు ధోని చెన్నై జట్టు తరపునే ఆడుతున్నాడు. మధ్యలో రెండు సంవత్సరాలు చెన్నై జట్టుని ఐపీఎల్ లో నిషేధం విధించడంతో ఆ సమయంలో రైజింగ్ పూణే అనే కొత్త జట్టుకి ఆడాల్సి వచ్చింది. అందుకే ఈ చెన్నై స్టేట్ లో ధోనికి ఇంత అభిమానం. తాజాగా సీఎం కరుణానిధి స్టాలిన్ తాను కూడా ధోనికి ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. స్టాలిన్ మాట్లాడుతూ” నేను ధోనికి పెద్ద అభిమానిని. అతడు మా దత్త పుత్రుడు. తమిళ్ నాడు తరపున అతను మరిన్ని మ్యాచులు ఆడాలని కోరుకుంటున్నాను” అని తెలిపాడు. మరి ఏకంగా సీఎం సైతం ధోనికి అభిమాని అని చెప్పడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.