సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ వివ్రాంత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ సారథి గౌతం గంభీర్‌ను కూడా అతడు దాటేశాడు.
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ప్లేఆఫ్స్ వెళ్లే దారులు మూసుకుపోయాయి. చివరి లీగ్ మ్యాచ్ తర్వాత ఆ జట్టు ఇక అస్సాంకే. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో హోమ్ గ్రౌండ్లో జరిగిన గత మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మంచి ప్రదర్శన చేసింది. బౌలింగ్‌లో తేలిపోయినా.. బ్యాటింగ్‌లో మాత్రం దుమ్మురేపింది. సన్‌రైజర్స్ ఓపెనర్ హెన్రిచ్ క్లాసెన్ అయితే సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీతో ఓడిపోయినప్పటికీ బ్యాటింగ్‌తో ప్రేక్షకుల అభిమానాన్ని గెలుపొందింది ఎస్ఆర్హెచ్. ఇక, ఇవాళ ముంబై ఇండియన్స్ తమ లాస్ట్ మ్యాచ్ ఆడేందుకు సన్‌రైజర్స్ సిద్ధమైంది. తమకు ప్లేఆఫ్స్ వెళ్లే అవకాశాలు లేకపోయినా ముంబై ప్లేఆఫ్స్ ఆశలను గల్లంతు చేసే ఛాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నెగ్గితే దాదాపుగా ముంబై కథ ముగిసినట్లే.
ముంబై, సన్‌రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగింది ఎస్ఆర్హెచ్. ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌కు తోడుగా యంగ్ ప్లేయర్ వివ్రాంత్ శర్మకు అవకాశం ఇచ్చింది రైజర్స్ మేనేజ్మెంట్. అయితే తన మీద పెట్టుకున్న నమ్మకాలను, ఈ ఛాన్స్‌ను వివ్రాంత్ వృథా చేయలేదు. 47 బాల్స్‌లో 69 రన్స్‌తో దుమ్మురేపాడు. 9 ఫోర్లు, 2 సిక్సులతో అతడు తన ఎంట్రీని ఘనంగా చాటాడు. ఈ క్రమంలో వివ్రాంత్ ఐపీఎల్లో ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ ప్లేయర్‌గా వివ్రాంత్ నిలిచాడు. ఈ విషయంలో తన కంటే ముందు ఉన్న స్వప్నిల్ (60), గౌతం గంభీర్ (58), దేవ్‌దత్ పడిక్కల్ (56)ను వివ్రాంత్ అధిగమించాడు. ముంబైతో వాంఖడేలో జరుగుతున్న మ్యాచ్‌లో 18.3 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది. ఎయిడెన్ మార్క్రమ్ (4 నాటౌట్), హ్యారీ బ్రూక్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Well played, Vivrant Sharma!
69 in 47 balls with 9 fours and 2 sixes – the highest individual score by an Indian on IPL debut. pic.twitter.com/TxxqnGoJcS
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2023