ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై యువ క్రికెటర్ చేసిన ఓ చిలిపి పని క్రికెటర్ల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.
వాంఖడే వేదికగా నేడు జరుగుతోన్న ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ బ్యాటర్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా కేకేఆర్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదిలావుంటే.. ముంబై యువ క్రికెటర్ చేసిన ఓ చిలిపి పని క్రికెటర్ల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
73 పరుగుల వద్ద కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది. హృతిక్ షోకీన్ వేసిన ఎనిమిదో ఓవర్ తొలి బంతికి కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా (5) రమణ్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అనంతరం అతడు పెవిలియన్‌కు వెళుతుండగా షోకీన్ ఏదో అన్నాడు. దీంతో రాణా కోపంగా అతని వైపు రాగా ముంబయి సారథి సూర్యకుమార్ కలుగజేసుకొని సముదాయించి పంపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా, ఈ మ్యాచులో కేకేఆర్ భారీ లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్ బాటపట్టినా స్కోరు బోర్డు మాత్రం పరుగులు పెడుతూనే ఉంది. ఓపెనింగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ వీరవిహారం చేస్తున్నాడు. అయ్యర్ 49 బంతుల్లో 9 సిక్సులు, 5 ఫోర్ల సాయంతో వంద బాదాడు.
Here Is The Lafda 😂🤣#MIvsKKR #NitishRana #Hrithikshokeen pic.twitter.com/cmm7t4rPyR
— The ♠️ PROFESSOR (@TheRaghavvvv) April 16, 2023
Words exchanged between Nitish Rana and Hrithik Shokeen pic.twitter.com/gb4atRqCNs
— All About Cricket (@allaboutcric_) April 16, 2023