16 ఏళ్ల ఐపీఎల్ టోర్నీలో మరో రికార్డు బద్దలైంది. దీనంతటికి మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ మెరుపులు కారణం. అచ్చం క్రికెట్ గేమ్ బ్యాటింగ్ తరహాలో సూర్య ఇన్నింగ్స్ కొనసాగడం గమనార్హం.
భారత క్రికెటర్, మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడి మెరుపు సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్స్ గా మలిచిన సూర్య ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న సూర్య 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. అచ్చం క్రికెట్ గేమ్ బ్యాటింగ్ తరహాలో సూర్య ఇన్నింగ్స్ కొనసాగడం గమనార్హం. సూర్య ధాటికి 16 ఏళ్ల ఐపీఎల్ రికార్డు కూడాబద్దలయ్యింది.
టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవడమే ఈ మ్యాచులో వారు చేసిన మొదటి తప్పు. బ్యాటింగ్ దిగిన ముంబై బ్యాటర్లు ధనాధన్ బ్యాటింగ్ కు పనిచెప్పారు. రోహిత్, ఇషాన్ కిషన్ పోటాపోటీగా బౌండరీలు బాదారు. దీంతో ముంబై పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 61 అపరుగులు చేసింది. ఆపై రషీద్ ఖాన్, ఒకే ఓవర్ లో వీరిద్దరిని పెవిలియన్ బాట పట్టించి స్కోర్ బోర్డుకు బ్రేకులు వేశాడు. అయితే సూర్య విజృంభణ మొదలయ్యాక, స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఓవర్ కు మూడు నుంచి నాలుగు బౌండరీల చొప్పున గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడాడు. సూర్య ధాటికి ముంబై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 218 పరుగులాస్ భారీ స్కోర్ చేసింది.
Suryakumar Yadav is the first Mumbai Indians batter to score an IPL century at the Wankhede Stadium in 12 years.
TAKE A BOW, SURYA! pic.twitter.com/QYeGJyCJNL
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2023
ఒక సీజన్‌లో ఐదు సార్లు 200ప్లస్ స్కోర్లు నమోదు చేసిన మొదటి జట్టుగా ముంబై అవతరించింది. ఈ సీజన్‌లో ముంబై.. ఆర్ సీబీపై 200, పంజాబ్ పై 216/ 201, రాజస్థాన్ రాయల్స్ పై 214, గుజరాత్ టైటాన్స్ పై 218 పరుగులు చేసింది. సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో ఇబ్బంది ముంబై వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. సూర్య మెరుపులతో పాటు యువ క్రిక్కెర్లు రాణించడం ముంబైకి బాగా కలిసొస్తోంది. నేడు(శుక్రవారం) గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచులో ముంబై విజయం సాధిస్తే, ప్లే ఆఫ్స్ కు మరికొంత దగ్గరకు చేరినట్టే.
The team behind the man! 💙#OneFamily #MIvGT #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @surya_14kumar pic.twitter.com/Gvdi19hl5R
— Mumbai Indians (@mipaltan) May 12, 2023