నేడు హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ జట్టుని తన ఇంటికి ఆహ్వానించి సర్ప్రైజ్ చేసాడు. మరి తిలక్ వర్మ ముంబై ప్లేయర్లను తన ఇంటికి ఎందుకు పిలిచాడు ?
గత రెండేళ్లుగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో తడబడుతున్నా .. తిలక్ వర్మ మాత్రం రాణిస్తున్నాడు. రోహిత్, సూర్య, కిషాన్,టిమ్ డేవిడ్, పొలార్డ్ లాంటి స్టార్లతో కూడిన ముంబై జట్టులో తిలక్ వర్మ తనదైన ముద్ర వేసాడు. ఒక రకంగా చెప్పాలంటే గత రెండు సీజలు తీసుకుంటే ముంబై జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు మన హైదరాబాద్ కుర్రాడు కావడం విశేషం. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ దృష్టిలో పడ్డాడు. త్వరలో టీమ్ ఇండియాలో అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు. అయితే ప్రతి సారి ఆటతో మెరిసే తిలక్ వర్మ ఈ సారి ఒక సర్ప్రైజ్ తో పలకరించాడు. ముంబై ఇండియన్స్ జట్టుని తన ఇంటికి ఆహ్వానించాడు.
ఐపీఎల్ లో ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రోహిత్ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితో సీజన్ ఆరంభించింది. అయితే ఆ తర్వాత తిరిగి గాడిలో పడిన ముంభై ఇండియన్స్ వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తుంది. వరుసగా ఢిల్లీ , కోల్ కత్తా జట్ల మీద గెలిచి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు నేడు సన్ రైజర్స్ తో మ్యాచ్ కోసం హైదరాబాద్ రానుంది. అయితే ప్రస్తుతం ముంబై జట్టుకి ఆడుతున్న తిలక్ వర్మది హైదరాబాద్ కావడంతో సచిన్ తో సహా ముంబై ఇండియన్స్ జట్టుని తన ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించాడు.
కిషాన్ , సూర్య , రోహిత్ ,గ్రీన్ తో పాటు సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఈ డిన్నర్ కి హాజరయ్యారు. ఇక ఈ ఫొటోలో లెజెండరీ సచిన్ టెండూల్కర్ ప్రేత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక నేడు రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ పోరుకి సిద్ధమయ్యాయి. రెండు జట్లు కూడా వరుసగా రెండు ఓటములతో టోర్నీ ఆరంభించినా.. ఆ తర్వాత రెండు మ్యాచ్ లు గెలిచి తిరిగి గాడిలో పడ్డారు. మరి నేడు హ్యాట్రిక్ విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. మొత్తానికి ఓ వైపు కుటుంబ సభ్యులతో మరో వైపు ముంబై ఇండియన్స్ జట్టుతో తిలక్ వర్మ హ్యాపీ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.