Virat Kohli: కోహ్లీ అంటే క్రికెట్‌లో కింగ్. అలాంటి క్రికెటర్‌ను అభిమానించని వారుండరు. అయితే.. ఓ క్రికెటర్ మాత్రం తన అభిమానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. కోహ్లీ జెర్సీని ఏకంగా తన ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అంటే తెలియని క్రికెట్ అభిమాని భూమ్మిద లేడంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇప్పటి జనరేషన్ క్రికెటర్లకు కోహ్లీ ఓ రోల్‌మోడల్. ఆ విషయాన్ని చాలా మంది యువ క్రికెటర్లు బహిరంగంగానే కోహ్లీపై తమ ఇష్టాన్ని బయటపెట్టారు. అయితే ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ మాత్రం ఏకంగా కోహ్లీ జెర్సీని ఫ్రేమ్ కట్టించుకుని మరీ తన ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోహ్లీ జెర్సీని ఫ్రేమ్ కట్టించుకోని ఇంట్లో పెట్టుకున్న ఆ క్రికెటర్ ఎవరో కాదు.. గతేడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుపై సంచలన ప్రదర్శన కనబర్చిన మెహిదీ హసన్ మిరాజ్.
భారత్ లాంటి పటిష్టమైన జట్టుపై గతేడాది బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌ను 2-1తో తేడాతో గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం ఈ మెహిదీ హసన్. తొలి వన్డేలో బంగ్లాదేశ్ 139 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా.. విరోచితంగా పోరాడి 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. బంగ్లాదేశ్‌కు గొప్ప విజయాన్ని అందించాడు. ఆ తర్వాత.. రెండో వన్డేలో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న టీమిండియాపై 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ సాధించాడు. అలాగే బౌలింగ్‌లోనూ అద్భుతం చేశాడు. మూడు వన్డేల్లో 4 వికెట్లు పడగొట్టాడు. 141 పరుగులు చేశాడు. ఇక టెస్టు సిరీస్‌లోనూ తొలి టెస్టులో 5 వికెట్లు పడగొట్టాడు.
అలాగే రెండో టెస్టులోనూ మెహిదీ 6 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుతంగా పోరాడి ఓడినా.. టీమిండియాను 145 పరుగుల టార్గెట్‌ను ఈజీగా చేరుకోనియకుండా.. మోహిదీ వణికించాడు. ఈ 6 వికెట్లలో ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్‌గా పేరొందిన కోహ్లీ వికెట్ కూడా ఉంది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీని అవుట్ చేశాడు. కోహ్లీ వికెట్ దక్కిన ఆనందంలో మోహిదీ చేసుకున్న సంబరాలు ఆ సమయంలో హైలెట్‌గా నిలిచాయి. అయితే.. ఆ పర్యటనలో తన మనసు గెలుచుకున్న మెహిదీకి కోహ్లీ తన జెర్సీని గిఫ్ట్‌గా అందించాడు. ఎంతో అపురూపంగా దాన్ని స్వీకరించిన మెహిదీ.. ‘గ్రేటెస్ట్ బ్యాటర్ నుంచి ప్రత్యేకమైన సావియర్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని’ సోషల్ మీడియాలో పేర్కొంటూ మురిసిపోయాడు. ఆ జెర్సీనే ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. టీవీ పైన ఒక వైపు కోహ్లీ జెర్సీ మరోవైపు మెహిదీ జెర్సీ ఉన్న ఫొటో వైరల్ అవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mehidy Hasan has framed the Jersey in his house which was gifted by Virat Kohli.
The GOAT – King Kohli. pic.twitter.com/1vlbjao7Lx
— Johns. (@CricCrazyJohns) April 29, 2023