ఐపీఎల్ లో తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ అయిన మన్ దీప్ సింగ్ ఓ చెత్త రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును సైతం బ్రేక్ చేశాడు.
IPL 2023 టోర్నీ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను పంచుతోంది. ప్రతీ మ్యాచ్ లో కూడా భారీ స్కోర్లు నమోదు చేస్తూ.. ఫ్యాన్స్ కు అసలైన మజాను అందిస్తున్నాయి టీమ్స్. ఇక తాజాగా గురువారం కోల్ కత్తా-రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దాంతో ఆర్సీబీ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేకేఆర్ ఓపెనర్ గుర్భాజ్, శార్దుల్ ఠాకూర్ లు అర్ధ శతకాలతో చెలరేగడంతో.. కేకేఆర్ 204 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ అయిన మన్ దీప్ సింగ్ ఓ చెత్త రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును సైతం బ్రేక్ చేశాడు.
కోల్ కత్త-రాయల్ ఛాలెంజర్స్ మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోల్ కత్తా జట్టులో శార్ధుల్ ఠాకుర్ సునామీ ఇన్నింగ్సే హైలట్ అని చెప్పాలి. సిక్స్ లు, ఫోర్లతో ఆర్సీబీ బౌలర్లను చీల్చిచెండాడాడు. ఈ క్రమంలోనే కేవలం 20 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేసి.. సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. శార్దులు 29 బంతుల్లో.. 9 ఫోర్లు, 3 సిక్స్ లతో 68 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి అండగా.. రింకూ సింగ్ (46), గుర్భాజ్ (57) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో విల్లే, కర్ణ్ శర్మ తలా రెండు వికెట్లను తీశారు.
అయితే ఈ మ్యాచ్ లో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు కేకేఆర్ బ్యాటర్ మన్ దీప్ సింగ్. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ ల చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ టోటల్ ఐపీఎల్ టోర్నీలో 223 మ్యాచ్ ల్లో 14 సార్లు డకౌట్ కాగా.. డీకే 209 మ్యాచ్ ల్లో 14 సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో విల్లీ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు మన్ దీప్ సింగ్. దాంతో 97 ఇన్నింగ్స్ ల్లో 15 సార్లు డకౌట్ అయ్యి వారిద్దరి చెత్త రికార్డును బ్రేక్ చేశాడు ఈ యంగ్ ప్లేయర్.