ఐపీఎల్ లో చెన్నై మరో టైటిల్ సొంతం చేసుకుంది. థ్రిల్లింగ్ మ్యాచ్ లో విక్టరీ కొట్టింది. అనుకున్నట్లుగానే ప్లేయర్లందరూ కలిసి ధోనికి గిఫ్ట్ గా ఐపీఎల్ ట్రోఫీని ఇచ్చారు. ఎన్నో ఎమోషన్స్, మరెంతో సందడి. అయితే ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అని పరిశీలిస్తే..క్రికెట్ ప్రేమికులు చాలా కారణాలే చెబుతారు. అయితే అసలు కారణం ఏంటి ని ఆరాతీస్తే..
ప్రత్యర్థిగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.. పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్.. చెన్నైతో పోల్చుకుంటే బలమైన జట్టు.. ఆడేది సొంత గడ్డ మీద.. జట్టు నిండా ఫామ్ లో ఉన్న ప్లేయర్లు.. దీనికి తోడు మొదటి బ్యాటింగ్ చేసి 214 పరుగుల భారీ స్కోర్.. షమీ, రషీద్ ఖాన్ లతో కూడిన బలమైన బౌలింగ్ లైనప్.. దానికి తగ్గట్లే చెన్నై ముందు చివరి 2 బంతుల్లో 10 పరుగుల టార్గెట్. ఈ దశలో చెన్నై గెలుస్తుందని కనీసం చెన్నై ఫ్యాన్స్ కూడా ఆశించి ఉండరు. అప్పటివరకు యార్కర్లు, స్లో బాల్ తో అదరగొడుతున్న మోహిత్ శర్మని చూసి చెన్నై అభిమానులతో పాటు డగౌట్ లో కూర్చున్న ప్లేయర్లు కూడా మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకున్నారు. రెండు నిమిషాల తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంలో పెద్ద అద్భుతమే చోటు చేసుకుంది. చివరి రెండు బంతులకి జడేజా సిక్సర్, ఫోర్ కొట్టి ఊహించని విజయాన్ని అందించాడు. ఇక అసాధ్యం అనుకున్న మ్యాచ్ లో పెద్ద అద్భుతమే జరిగి చెన్నై గెలవడంతో.. ఒక సెంటిమెంట్ ఇప్పుడు బలంగా నమ్మాల్సి వస్తుంది. అదేంటో కాదు మహేంద్ర సింగ్ ధోని జాతక బలం.
ఐపీఎల్ లో చెన్నై మరో టైటిల్ సొంతం చేసుకుంది. థ్రిల్లింగ్ మ్యాచ్ లో విక్టరీ కొట్టింది. అనుకున్నట్లుగానే ప్లేయర్లందరూ కలిసి ధోనికి గిఫ్ట్ గా ఐపీఎల్ ట్రోఫీని ఇచ్చారు. ఎన్నో ఎమోషన్స్, మరెంతో సందడి. అయితే ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అని పరిశీలిస్తే..క్రికెట్ ప్రేమికులు చాలా కారణాలే చెబుతారు. అయితే అసలు కారణం ఏంటి ని ఆరాధిస్తే మాత్రం ధోని జాతకమే అని తెలుస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నమ్మడానికి కాస్త టైం పట్టినా.. కొన్ని విషయాలను గమనిస్తే మీకే అర్ధమే అవుతుంది. నిజానికి 214 పరుగుల భారీ లక్ష్యం అంటే గుజరాత్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని ఛేదించడం చాలా కష్టం. అయితే వర్షం రూపంలో చెన్నైకి కాస్త కలిసి వచ్చిందనే చెప్పాలి.
డక్ వర్త్ లూయిస్ ప్రకారం టార్గెట్ ని 15 ఓవర్లలో 171 పరుగులకి కుదించారు. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. అంటే చెన్నై జట్టు 5 ఓవర్లో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు కొట్టినట్టే. దీనికి తోడు మరో నాలుగు ఓవర్ల పవర్ ప్లే. మ్యాచ్ మధ్యలో ఎక్కడ వర్షం పడినా గుజరాత్ విజయం సాధించేది. ఎందుకంటే ఎప్పటికప్పుడు డక్ వర్త్ లూయిస్ ప్రకారం చెన్నై వెనకంజలోనే ఉంది. ఇక ఇదంతా పక్కన పెడితే ఐపీఎల్ లాంటి ఫైనల్లో ఒత్తిడిని తట్టుకొని చివరి రెండు బంతుల్లో 10 పరుగులు సాధించడమంటే అదృష్టంగానే భావించాలి. ముఖ్యంగా చివరి బంతికి 4 పరుగులు చేయాల్సిన దశలో వెనకాలే ఫీల్డర్ ఉన్నా.. అతడి పక్క నుంచే బాల్ వెళ్లడం చెన్నై అదృష్టాన్ని తెలియజేస్తుంది. గ్రౌండ్ లో చెన్నై బ్యాటర్లు చెలరేగి ఆడినా.. ధోని బలమైన జాతకమే చెన్నైని విజేతగా నిలిపిందని నమ్మక తప్పడం లేదు. ఒక సారి ధోని జాతకాన్ని పరిశీలిస్తే..
మన దేశంలో వందలో తొంభై శాతంమంది నమ్మే.. జాతకాల ప్రకారం చూస్తే.. ధోనిది తిరుగులేని జాతకమంట. అతను పట్టిందల్లా బంగారమే. నిజానికి ధోని కెరీర్‌ను పరిశీలిస్తే.. ఈ విషయం నిజమని నమ్మక మానలేం. జట్టులో యువరాజ్ సింగ్, సెహ్వాగ్ లాంటి సీనియర్లు, స్టార్లు ఉండగా.. ధోనికే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. ధోని కెప్టెన్సీలో టీమిండియా అండర్ డాగ్‌గా తొలి టీ20 వరల్డ్‌లో అడుగుపెట్టి విశ్వవిజేతగా నిలిచింది. 1983 తర్వాత ప్రపంచ కప్ నెగ్గని జట్టు 2011లో వన్డే ఛాంపియన్ అయింది కూడా ధోని కెప్టెన్సీలోనే. జట్టును మూడు ఫార్మాట్లలో విజయవంతంగా కొన్ని ఏళ్లపాటు నడిపాడు. ఇందంతా ధోని జాతక బలంతోనే జరుగుతుందట.
1981 జూలై 7న ధోని జార్ఖండ్‌లో జన్మించాడు. అతని రాశి కర్కాటక(క్యాన్సర్) రాశి. ధోని పుట్టిన సమయం అతని రాశి ప్రకారం చూస్తే.. ధోని జీవితం ఒక అద్భుతమంట. ఆజన్మాంతం కూడా ధోనికి ప్రజల్లో ఆదరణ దక్కుతుందట. భవిష్యత్తులో ధోని రాజయకీల్లో కూడా రాణించే అవకాశం ఉందట. ధోని రాజకీయాలు వద్దనుకున్నా.. అతని జాతక చక్రం ప్రకారం అది జరిగి తీరుతుందట. రాజకీయ ప్రవేశమే కాకుండా.. ప్రతిష్టాత్మకమైన పదవిని కూడా అలంకరిస్తాడంట ధోని. ప్రస్తుతం ధోని గురించి ఈ ఆసక్తి విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతటి బలమైన జాతకం ధోనికి ఉంది కాబట్టే.. చెన్నై మరోసారి ఛాంపియన్ గా నిలిచిందని ధోని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ధోని అంటే అదృష్టం.. ధోని అద్భుతం.. ధోని అంటే విజయం.. ధోని అంటే నమ్మకం..అని మరోసారి ప్రూవ్ అయింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.