ధోని అంటే గవాస్కర్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ అభిమానం ఆటోగ్రాఫ్ అడిగే రేంజ్ లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఇదిలా ఉండగా.. ధోని ఈ ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో పట్టలేని ఆనందంతో గవాస్కర కొన్ని వ్యాఖ్యలు చేసాడు.
భారత క్రికెట్ లో సునీల్ గవాస్కర్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తన బ్యాటింగ్ తో 1970, 80ల్లోనే తన సత్తా చూపించి భారత క్రికెట్లో ఒక దిగ్గజంగా నిలిచాడు. ఇప్పుడు చాలా మంది బ్యాటర్లు రాణిస్తున్నారంటే దానికి కారణం గవాస్కర్ వేసిన దారే. ప్రస్తుతం ఐపీఎల్ లో కామెంటరీగా చేస్తున్న గవాస్కర్ కొన్ని రోజుల క్రితం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ అనంతరం చెన్నై గ్రౌండ్ లో ధోని దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవడం అందరిని ఆకట్టుకుంది. దీంతో ఎమోషనల్ కి గురైన సన్నీ కొన్ని విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తనకు క్రికెట్లో ఒక రెండు క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు.
ధోని అంటే గవాస్కర్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ అభిమానం ఆటోగ్రాఫ్ అడిగే రేంజ్ లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఇదిలా ఉండగా.. ధోని ఈ ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో పట్టలేని ఆనందంతో గవాస్కర కొన్ని వ్యాఖ్యలు చేసాడు. గవాస్కర్ మాట్లాడుతూ “చెపాక్ స్టేడియంలో ఆటగాళ్లంతా ధోనితో కలిసి తిరుగుతారని నేను ఊహించలేదు. ఈ విషయం తెలియగానే ప్రత్యేకంగా గుర్తుండేలా ఏదైనా చేయాలనుకున్నాను. వెంటనే ధోని ఆటోగ్రాఫ్ కోసం పరిగెత్తాను. అదే సమయంలో కెమెరా యూనిట్ లో ఒకరి వద్ద మార్కర్ పెన్ ఉండడం నా అదృష్టం. వెంటనే పెన్ను తీసుకొని మహి వద్దకు వెళ్ళాను. షర్ట్ పై ఆటోగ్రాఫ్ కావాల్సిందిగా కోరాను . దీనికి మాహి ఒప్పుకోవడం నా జీవితంలో ఉద్వేగమైన క్షణం” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సందర్భంగా తన జీవితంలో అతి ముఖ్యమైన క్షణాల గురించి గవాస్కర్ అందరితో పంచుకున్నాడు. భారత క్రికెట్ లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయే రెండు వరల్డ్ కప్ క్షణాలు నాకు చాల ఇష్టం. 1983 లో కపిల్ దేవ్ లార్డ్స్ లో వరల్డ్ కప్ ఎత్తిన క్షణం, 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోని కొట్టిన సిక్సర్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలు. నేను చనిపోయే ముందు ఈ రెండు క్షణాలను చూడాలనుకుంటున్నాను. అని ఈ దిగ్గజం తెలియజేశాడు. మరి క్రికెట్ మీద ఇంత అభిమానం ఉన్న ఈ దిగ్గజం చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.