లక్నో జట్టు ప్రస్తుత ఐపీఎల్ లో ముదురు మరియు లేత నీలం రంగుతో కూడిన జెర్సీ ధరిస్తున్నారు. అయితే వీరు ఆడబోయే తమ చివరి లీగ్ మ్యాచ్ కోసం ఇప్పుడు ఒక స్పెషల్ జెర్సీ ధరించనున్నారు. మరి లక్నో సూపర్ జయింట్స్ ధరించే ఆ స్పెషల్ జెర్సీ ఏంటి ?
ఐపీఎల్ లో ప్రస్తుతం స్పెషల్ జెర్సీ ట్రెండ్ మొదలైనట్లుగా కనిపిస్తుంది. ఎప్పటినుంచో ఆర్సీబీ ప్రతి సీజన్ లో ఒకసారి గ్రీన్ డ్రెస్ ధరిస్తూ పర్యావరణం మీద అవగాహన కల్పిస్తూ వచ్చింది. అయితే ఆర్సీబీ బాటలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు ఇటీవలే లావెండర్ కలర్ జెర్సీ ధరించి క్యాన్సర్ కి వ్యతిరేఖంగా పోరాడింది. ఈ ఈ నేపథ్యంలో తాజాగా.. లక్నో సూపర్ జయింట్స్ ఒక కొత్త జెర్సీ ధరించి అభిమానులని సర్ ప్రైజ్ చేయనుంది. మరి లక్నో సూపర్ జయింట్స్ ధరించే ఆ స్పెషల్ జెర్సీ ఏంటి ? ఎందుకు వేసుకున్తున్నారో ఇప్పుడు చూద్దాం.
లక్నో జట్టు ప్రస్తుత ఐపీఎల్ లో ముదురు మరియు లేత నీలం రంగుతో కూడిన జెర్సీ ధరిస్తున్నారు. అయితే వీరు ఆడబోయే తమ చివరి లీగ్ మ్యాచ్ కోసం ఇప్పుడు ఒక స్పెషల్ జెర్సీ ధరించనున్నారు. ఈ నెల 20 న కేకేఆర్ తో ఈ మ్యాచ్ ఉండబోతుంది. కేకేఆర్ జట్టు దాదాపు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన కారణంగా కేకేఆర్ అభిమానులని తమ వైపుకి లాక్కోవడానికి ఈ జెర్సీ ధరిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఎందుకు అని కారణం విశ్లేషిస్తే ప్రస్తుతం లక్నో జట్టుకి ఒనేర్ గా ఉంటున్న సంజీవ్ గోయంకె ఇండియన్ సూపర్ లీగ్ చాంపియన్ మోహన్ బాగాన్ టీంకి కూడా ఒక వాటా దారుడే. ఈ జట్టు ఇండియన్ సూపర్ లీగ్ ఛాంపియన్ గా అవతరించింది. దీంతో ఈ టీంని అభినందిస్తూ ఈ ప్రేత్యేక నిర్ణయం తీసుకుంది.
ISL చాంపియన్లకు ప్రత్యేకమైన నివాళులు అర్పించడానికి ఏ జర్సీ ధరిస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇందుకు లక్నో గజబ్ అందాజ్.. ఇప్పుడు కోల్ కత్తా రంగుల్లో అనే క్యాప్షన్ జోడించింది. ISL ఛాంపియన్ మోహన్ బాగాన్ మరియు సిటీ ఆఫ్ జాయ్ కి ప్రేత్యేక నివాళి అని పేర్కొంది. ఇక లక్నో ప్రస్తుతం 13 మ్యాచుల్లో 15 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ కి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో తన చివరి మ్యాచులో కేకేఆర్ మీద ఆది గెలిస్తే ప్లే ఆఫ్ కి వెళ్తుంది. ఒకవేళ ఓడినా గాని ఇతర జట్ల ఫలితాల మీద లక్నో భవితవ్యం ఆధారపడి ఉంది. మరి లక్నో ఫుట్ బాల్ టీం కోసం స్పెషల్ జెర్సీ ధరించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.