లక్నో సారథి కేఎల్ రాహుల్ తీవ్రంగా గపడ్డాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత బ్యాటర్, లక్నో సారథి కేఎల్ రాహుల్ తీవ్రంగా గపడ్డాడు. ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ బంతి కోసం పరుగెడుతున్న సమయంలో ఒక్కసారిగా కాలు పట్టేసింది. దీంతో అక్కడికక్కడే కూలబడిపోయాడు. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అతనిని మైదానం నుండి బయటకి తీసుకెళ్లారు. రాహుల్ మరోసారి ఈ మ్యాచులో బరిలోకి దిగేది అనుమానమే అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి క్రునాల్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఇదిలావుంటే.. ఈ మ్యాచులో టాస్ గెలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లీ(21) – డుప్లెసిస్(42) జోడి నిలకడగా ఆడుతున్నారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. కాగా, తొలి రౌండ్‌లో లక్నో ఆఖరి ఓవర్లో ఆర్సీబీకి షాకచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, ఈసారి ఆ జట్టును సొంతగడ్డపై ఓడించాలని డూప్లెసిస్ సేన భావిస్తోంది. అది జరగాలంటే డూప్లెసిస్ సేన లక్నో బ్యాటర్ల ముంగిట భారీ లక్ష్యాన్ని నిర్దేశించక తప్పదు. ఈ మ్యాచులో విజయం ఎవరిదో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
LSG skipper KL Rahul walks off the field after an injury. Hope it’s not serious🤞
Wishing @klrahul a speedy recovery.
📸: Jio Cinema pic.twitter.com/8RhtQZ0g9L
— CricTracker (@Cricketracker) May 1, 2023
KL Rahul injured #LSGvsRCB pic.twitter.com/ZpMBw0bMM3
— Vanson Soral (@VansonSoral) May 1, 2023