గౌతం గంభీర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గత మ్యాచులో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో జరిగిన గొడవ మరవకముందే.. మరోసారి అలానే ప్రవర్తించడం పలు విమర్శలకు తావిస్తోంది. బుధవారం లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచులో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత మాజీ దిగ్గజ క్రికెటర్, లక్నో గెయింట్స్ మెంటర్ గౌతం గంభీర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గత మ్యాచులో టీమిండియా మాజీ సారథి, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఎంత పెద్ద గొడవైందో అందరికీ విదితమే. సహచర ఆటగాళ్లు ఆపకపోయుంటే.. కొట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత పెద్ద గొడవైంది. ఇది చాలదన్నట్లు గంభీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి అంపైర్లపైకి దూసుకెళ్లాడు. బుధవారం లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఐపీఎల్ 2023లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేపట్టిన లక్నో ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసిన లక్నో, పది ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. అనంతరం ఆయుష్ బధోని(59)- పురాన్(20) జోడి జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక మరో ఓవర్లో మ్యాచ్ ముగుస్తుంది అనంగా.. ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో అంపైర్లు ఆటను నిలివేయగా.. గౌతం గంభీర్ ఎంట్రీ ఇచ్చాడు.
Ye barish ko bolo aukat me rhe….maine World Cup final me 97 mare hai @GautamGambhir @LucknowIPL #LucknowSuperGiants #Ayushbadoni #Jadeja #Chahar #LSGvsRCB #Gambhir @akakrcb6 pic.twitter.com/ZkS5sOjOcj
— Krishnendu Ghosh (@Krishne59353468) May 3, 2023
వర్షం అంతరాయం కలిగించే అవకాశం అంపైర్లకు ముందునుంచే తెలిసినా.. ఎందుకు ఇన్నింగ్స్‌ను స్పీడప్ చేయలేదని వాదించాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి. లక్నో బ్యాటర్లు మరోసారి బ్యాటింగ్ అవకాశం లేకపోవడమే అందుకు కారణం. ఈ మ్యాచులో లక్నో యువ బ్యాటర్ ఆయుష్ బధోని హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతులు ఎదుర్కొన్న బధోణి 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో తీక్షణ, పతిరాణా, మోయిన్ అలీ తలా రెండు వికెట్లు తీసుకోగా, జడేజా ఓకే వికెట్ పడగొట్టాడు. గౌతం గంభీర్ ప్రవర్తనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Most happiest person @GautamGambhir 👏👏🙌 pic.twitter.com/1BqheVSO0U
— NTR MANIA (@tarakStan999) May 3, 2023