ముంబయికి ఎప్పుడూ కలిసొచ్చే ఓ సెంటిమెంట్.. ఇప్పుడు రివర్స్ అయింది. ఫ్లే ఆఫ్ ఛాన్సుల్ని మరింత కష్టంగా మార్చేసింది. ఇంతకీ ఏంటి సంగతి?
ముంబయి ఇండియన్స్ ని ఛేజింగ్ లో కింగ్ అని అంటారు. అందుకు తగ్గట్లే గత కొన్నేళ్ల నుంచి ఐపీఎల్ లోని కీలకమైన మ్యాచుల్లో గెలుస్తూ వచ్చింది. ఈసారి కూడా అలా 200 పైచిలుకు స్కోర్లని నాలుగైదు సార్లు ఛేజింగ్ చేసింది. ఆ ఊపుని కొనసాగిస్తూ లక్నోపై గెలిచేయాలని చూసింది. కానీ పరిస్థితులు కలిసి రాకపోవడంతో గెలుపుకి చాలా దగ్గరగా వచ్చి మరీ ఓడిపోయింది. అయితే ఇక్కడ ఆడటం, ఆడకపోవడం గురించి పక్కనబెడితే.. దేవుడి సెంటిమెంట్ అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అసలు విషయానికొచ్చేస్తే.. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబయి చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 177/3 స్కోరు చేయగా.. ఛేదనలో రోహిత్ సేన 172/5 పరుగులకి మాత్రమే పరిమితమైంది. చివరి ఓవర్ లో మోసిన్ కేక పుట్టించే బౌలింగ్ వేసి 11 రన్స్ కొట్టకుండా డిఫెండ్ చేశాడు. మైదానంలో లక్నో ప్లేయర్స్ అందరూ కలిసికట్టుగా ఆడారు. అదే టైంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా మాత్రం ఏ దేవుడి ఫొటోనో తెలీదు గానీ తెగ మొక్కుతూ కనిపించారు. ఆ ఫొటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి.
నార్మల్ గా ముంబయి మ్యాచ్ లు జరిగేటప్పుడు ఆ జట్టు ఓనర్ నీతా అంబానీ ఎక్కువగా ఇలా దేవుడి సెంటిమెంట్ ని ఫాలో అవుతూ వచ్చింది. చాలాసార్లు ఇది వర్కౌట్ అయింది కూడా. ఇప్పుడు లక్నోతో మ్యాచ్ లో రోహిత్ సేనకు అదే రివర్స్ కొట్టిందని చెప్పాలి. అనుకోవడానికి ఫన్నీగా ఉన్నప్పటికీ సెంటిమెంట్స్ ని ఫాలో అయ్యేవాళ్లు కూడా ఉంటారు కదా! సో అదనమాట విషయం. ఇదిలా ఉండగా ముంబయి నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ ఉంది. ఇందులో గెలిచినా సరే ప్లే ఆఫ్స్ కి చేరాలంటే మిగతా జట్ల ఫలితాలు అనుకూలంగా రావాలి. అప్పుడే ముంబయి ప్లే ఆఫ్స్ కి చేరుకుంటుంది. లేదంటే కష్టమే. సరే ఇదంతా వదిలేయండి. ముంబయిని దేవుడి సెంటిమెంట్ దెబ్బకొట్టడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.