చెన్నైను గెలిపించిన జూనియర్ మలింగపై సీనియర్ మలింగ ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిని జయించిన తీరు అద్భుతం అంటూ చెప్పుకొచ్చాడు మలింగ.
2023 ఐపీఎల్ లో క్రికెట్ ఫ్యాన్స్ కు అసలైన మజాను చూపించింది చెన్నై-ఆర్సీబీ మ్యాచ్. ఇప్పటికే ఈ సీజన్ అభిమానుల అంచనాలను అందుకుంటూ దుసుకెళ్తోంది. రెండు హేమా హేమి జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో చెన్నై జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు కాన్వే. ఇతడితో పాటుగా మరో బౌలర్ సీఎస్కే విజయానికి కారణం అయ్యాడు. దాంతో అతడిపై ప్రశంసలు కురిపించాడు శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ. ఆ బౌలర్ చివరి ఓవర్లో ఒత్తిడిని అధిగమించిన తీరు అమెఘం అంటూ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం చెన్నై- ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్ వరకు ఫ్యాన్స్ కు అసలైన వినోదాన్ని పంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో కాన్వే(83), దుబే(52), రహానే(37) రన్స్ చేశారు. అనంతరం 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. దాంతో 8 రన్స్ తేడాతో ఓటమి చెందింది. మాక్స్ వెల్(76), డుప్లెసిస్(62) రాణించినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.
ఇక బెంగళూరు కు చివరి ఓవర్ లో 6 బంతులకు 19 పరుగులు అవసరం కాగా.. అద్భుతంగా బౌలింగ్ చేసిన మతీషా పతిరనా కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బెంగళూరు బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు మతీశ. బెంగళూరు బ్యాటర్ అయిన ప్రభు దేశాయ్ ను అద్భుతంగా కట్టడి చేశాడు. దాంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక శ్రీలంక స్టార్ పేసర్, మాజీ ఆటగాడు లసిత్ మలింగ చెన్నై బౌలర్ అయిన మతీషా పతిరణపై ప్రశంసలు కురిపించాడు.
‘లాస్ట్ ఓవర్లో ఒత్తిడిని జయించిన తీరు అద్భుతం, ఎక్స్ లెంట్ ఎక్స్ క్యూటీవ్’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు మలింగ. ఇక మలింగ పోస్ట్ కు రిప్లై ఇచ్చాడు పతిరణ. థ్యాంక్యూ లెజెండ్, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటే మరింతగా రాణిస్తాను అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో తొలి మూడు ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చుకున్న పతిరణ.. చివరి ఓవర్లలో పుంజుకున్న ఇతడు కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మెుత్తంగా 4 ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక వరల్డ్ క్రికెట్ లో జూనియర్ మలింగగా పేరుగాంచిన ఈ లంక క్రికెటర్.. అద్భుతంగా రాణిస్తున్నాడు.
Impressive stuff Matheesha❤️
Loved the way you handled the pressure at the death.
Excellent execution👏 @matheesha_9 #RCBvCSK #IPL2023— Lasith Malinga (@malinga_ninety9) April 17, 2023
Thank you Legend ❤️. Keep supporting like you always do. pic.twitter.com/EVHXoXO3Oy
— Matheesha Pathirana (@matheesha_9) April 18, 2023