సాధారణంగా అంపైర్ లు గ్రౌండ్ లో ఎలాంటి భావోద్వేగాలను చూపించారు. భారీ సిక్సర్లు, స్టన్నింగ్ క్యాచులు పట్టిన ఇవేమి మాకు కొత్త కాదు అనేలా ఉంటారు. ముఖంలో ఎలాంటి హావభావాలను చూపించకుండా చాలా స్ట్రిక్ట్ గా, ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. అయితే నిన్న మ్యాచులో ఒక క్యాచ్ అంపైర్ నే అవాక్కయేలా చేసింది.
ఐపీఎల్ అంటే కేవలం సిక్సులు ఫోర్లు మాత్రమే కాదు, కళ్ళు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు కూడా వావ్ అనేలా ఉంటాయి. ముఖ్యంగా బౌండరీ రోప్ దగ్గర కొంతమంది ఊహకందని విధంగా క్యాచులు తీసుకొని బ్యాటర్లను షాక్ కి గురి చేస్తారు. ప్రతి ఐపీఎల్ లో ఇలాంటివి మనం కామన్ గా చూస్తూ ఉంటాము. అయితే ఇలాంటి స్టన్నింగ్ క్యాచులు మనం ఎన్నో చూసినా.. నిన్న ఐపీఎల్ లో అందుకున్న ఒక క్యాచ్ మాత్రం వావ్ అనిపించేలా ఉంది. ఈ క్యాచ్ స్పెషాలిటీ ఏంటంటే.. ఏకంగా అంపైర్ నే అవాక్కయేలా చేసింది. మరి అంపైర్ లు అంతలా ఆశ్చర్య పరచిన క్యాచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా అంపైర్ లు గ్రౌండ్ లో ఎలాంటి భావోద్వేగాలను చూపించారు. భారీ సిక్సర్లు, స్టన్నింగ్ క్యాచులు పట్టిన ఇవేమి మాకు కొత్త కాదు అనేలా ఉంటారు. ముఖంలో ఎలాంటి హావభావాలను చూపించకుండా చాలా స్ట్రిక్ట్ గా, ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. అయితే నిన్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచులో స్పిన్నర్ లలిత్ యాదవ్ ఒక అద్బుతమైన క్యాచ్ అందుకొని బ్యాటర్, ఆడియన్స్ తో పాటు అంపైర్ ని షాక్ కి గురి చేసాడు. చెన్నై ఇన్నింగ్స్ 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లను 77 పరుగులు చేసింది. పిచ్ స్పిన్ కి బాగా అనుకూలిస్తుండడంతో కెప్టెన్ వార్నర్.. లలిత్ యాదవ్ తో బౌలింగ్ కంటిన్యూ చేస్తున్నాడు.
లలిత్ 12 ఓవర్ తొలి బంతిని వేయగా బ్యాటర్ అజింక్య రహానే ముందుకొచ్చి ఆడాడు. కాస్త బలంగా భారీ షాట్ కి ప్రయత్నించిన రహానే.. లలిత్ యాదవ్ డైవ్ చేసి తీసుకున్న క్యాచ్ కారణంగా పెవిలియన్ బాట పట్టాడు.ఈ షాట్ కొట్టినప్పుడు కెమెరా మ్యాన్ సైతం బౌండరీ వైపు చూపించాడు. కానీ లలిత్ యాదవ్ కళ్ళు చెదిరే క్యాచ్ అని ఆ తర్వాత అర్ధం అయింది. ఈ క్యాచ్ కి అంపైర్ కూడా నోరెళ్లబెట్టాడు. ఎప్పుడూ ఇలాంటి క్యాచ్ నేను చూడలేదు అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కొట్టడం, పట్టడం అంత రెప్పపాటుకాలంలో జరిగిపోయింది. ఇక ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి అంపైర్ నే షాక్ అయ్యేలా చేసిన ఈ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
THAT. WAS. STUNNING! 👌 👌
Relive that sensational catch from @LalitYadav03 👍 👍
Follow the match ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC | @DelhiCapitals pic.twitter.com/z15ZMq1Z6E
— IndianPremierLeague (@IPL) May 10, 2023