ఐపీఎల్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జయింట్స్, సన్ రైజర్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో లక్నో బౌలర్ కైల్ మేయర్స్ ఒక వింతైన నో బాల్ వేయడం గమనార్హం.
ఐపీఎల్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జయింట్స్, సన్ రైజర్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫామ్ లో ఉన్న క్లాసేన్(47), అబ్దుల్ సమద్(37) భారీ భాగస్వామ్యం నెలకొల్పగా.. ఓపెనర్ అల్మొప్రీత్ సింగ్(36) కెప్టెన్ మార్కరం(28) , త్రిపాఠి(20) తలో చేయి వేశారు. బౌలింగ్ లో కృనాల్ పాండ్య పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో లక్నో బౌలర్ కైల్ మేయర్స్ ఒక వింతైన నో బాల్ వేయడం గమనార్హం.
లక్నో బ్యాటింగ్ ఆల్ రౌండర్ కైల్ మేయర్స్ నోబాల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది. ఉప్పల్ లో జరుగుతున్న ఈ మ్యాచులో మేయర్స్ రెండో ఓవర్లో బౌలింగ్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్లో వేసిన ఐదో బంతికి అభిషేక్ శర్మ మిడాన్ మీదకి కొట్టి సింగల్ తీసాడు. అయితే ఈ బాల్ ని అంపైర్ నోబాల్ గా ప్రకటించాడు. బౌలర్ గ్రీజ్ దాటలేదు. బీమర్ కూడా కాదు. దీంతో ఆశ్చర్యానికి గురైన మేయర్స్ అంపైర్ ని ప్రశ్నించాడు. దీంతో అంపైర్ రిటర్న్ గ్రీజ్ పై పాదం ఉంచావని ఇది నోబాల్ కింద వస్తుందని చెప్పాడు. ఆర్టికల్ 21.5.1 ప్రకారం బౌలర్ రిటర్న్ గ్రీజ్ రిటర్న్ గ్రీజ్ లో పదం ఉంచి బంతి విసిరితే దానిని బ్యాక్ ఫుట్ నోబాల్ గా పరిగణిస్తారు. వికెట్లను అటూ.. ఇటూ ఉండే రిటర్న్ గ్రీజ్ పై పాదం ఉంచి బౌలింగ్ చేయకూడదు. దీంతో అంపైర్ ఫ్రీ హిట్ ని ప్రకటించగా.. అల్మొప్రీత్ సింగ్ దానిని వృధా చేసాడు. మరి మేయర్స్ వేసిన వింత నోబాల్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.