ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనతో ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరుస్తున్నాడు. జట్టు పరంగా ముంబయి పర్వాలేదనిపించినా.. హిట్ మ్యాన్ మాత్రం ఉసూరుమనిపిస్తున్నాడు. తాజాగా చెన్నైతో మ్యాచ్ లో కూడా డకౌట్ కావడంతో ఐపీఎల్ లో అత్యంత చెత్త రికార్డును రోహిత్ శర్మ నెలకొల్పాడు.
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అలియాస్ హిట్ మ్యాన్.. ఐపీఎల్లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. తాజాగ అతను ఐపీఎల్లోనే అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 16 సార్లు డకౌట్ అయ్యి అందరి కంటే టాప్ ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు. రోహిత్ శర్మ ఆటతీరు గురించి, అతని టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను ఎంతమేర రాణించగలడు? అతని సామర్థ్యం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానలుకు తెలుసు. కానీ, రోహిత్ శర్మ విషయంలో టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా ఏ క్రికెటర్ అయినా కెరీర్ లో కొంత ఫామ్ లేమిని ఎదుర్కొంటాడు. అలాగే ఇప్పుడు ఐపీఎల్ లో రోహిత్ శర్మ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. పరుగులు చేయకుండానే డకౌట్ అవుతూ పెవిలియన్ చేరుతున్నాడు. అక్కడికీ అతను ఆర్డర్ మార్చుకుని మైదానంలోకి దిగుతున్నా కూడా ఆ డకౌట్లు అతడిని వదలడం లేదు. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ డకౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అతని కామెంట్స్ పై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్ రోహిత్ శర్మకు సారీ చెప్పాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు.
👉MSD comes up to the stumps 😎
👉Rohit Sharma attempts the lap shot
👉@imjadeja takes the catch 🙌
Watch how @ChennaiIPL plotted the dismissal of the #MI skipper 🎥🔽 #TATAIPL | #MIvCSK pic.twitter.com/fDq1ywGsy7
— IndianPremierLeague (@IPL) May 6, 2023
కృష్ణామాచిర శ్రీకాంత్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ తన పేరుని నో హిట్ మ్యాన్ గా మార్చుకోవాలని కోరాడు. అక్కడితో ఆగకుండా.. తానైతే రోహిత్ శర్మను జట్టులోకి కూడా తీసుకోను అంటూ చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక టీమిండియా మాజీ ఓపెనర్ గా భారత జట్టు కెప్టెన్ కి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. రోహిత్ పర్ఫార్మెన్స్ చూస్తే.. ఈ సీజన్ లో ఆడిన 10 మ్యాచుల్లో 184 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నైపై డకౌట్ తో.. సునీల్ నరైన్(15), మన్ దీప్ సింగ్(15), దినేశ్ కార్తీక్(15)ను దాటి రోహిత్ శర్మ 16సార్లు డకౌట్ అయ్యి చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
Krish Srikkanth – “Rohit Sharma should change his name to ‘NO HIT SHARMA’, I will not even play him in XI if I was Captain of MI”
(In Star Sports) pic.twitter.com/SF46Ph1Bv5
— ♚ (@balltampererr) May 6, 2023