ఐపీఎల్ లో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా కేకేఆర్ జట్టు ఫాలోయింగ్ లో అన్ని జట్లను దాటేసింది. మరి కేకేఆర్ టీమ్ ఏ విషయంలో నెంబర్ వన్ గా నిలిచిందో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ లో బాగా పాపులారిటీ ఉన్న జట్టు ఏది అనగానే మనకు వెంటనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఠక్కున గుర్తుకొస్తాయి. ఇక ఈ రెండిటి తర్వాత టీమ్ ముంబై ఇండియన్స్ కి ఓటేస్తారు. ధోని, కోహ్లీ, రోహిత్ లాంటి స్టార్లు జట్టులో ఉండడం వలన ఆయా జట్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒక విషయంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ అన్ని జట్లకు షాకిచ్చింది. ఏకంగా ప్రపంచంలోనే అత్యధిక ఫాలోయింగ్ లో కలిగిన జట్లలో మూడో స్థానంలో నిలిచింది. మరి ఎందులో కేకేఆర్ టాప్ లో నిలిచిందో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ లో కేకేఆర్ జట్టులో ఎలాంటి స్టార్ క్రికెటర్లు లేరనేది వాస్తవం. ఉన్న ఒక్క స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా గాయం కారణంగా ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడడం లేదు. ఇక జట్టులో ఉన్నవారు ఎవరూ కూడా ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచులు ఆడడం లేదు. మరి అయినా కేకేఆర్ జట్టు ఒక విషయంలో టాప్ లో నిలిచింది. ట్విట్టర్ లో చెన్నై ఆధిపత్యం చూపించినా.. ఇంస్టాగ్రామ్లో ఆర్సీబీ తన హవా చూపిన ఫేస్ బుక్ లో మాత్రం కేకేఆర్ జట్టుదే పై చేయి సాధించింది. అయితే ఫేస్ బుక్ లో అభిమానులతో కేకేఆర్ ప్లేయర్లు టచ్ లో ఉండడం.. అదేవిధంగా రింకు సింగ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ కారణంగా అన్ని జట్ల కన్నా షారుఖ్ టీమ్ ముందంజలో ఉంది.
ప్రపంచంలో ఫేస్ బుక్ లో మోస్ట్ పాపులర్ టీమ్ లో టాప్ 5 లో ఐపీఎల్ నుంచి ఒక్క కేకేఆర్ జట్టే ఉండడం విశేషం. 19.4 మిల్లియన్లతో ఈ లిస్టులో మూడో స్థానంలో ఉంది. ఇక టాప్ 5 లో మిగిలిన నాలుగు పాపులారిటీ కలిగిన ఫుట్ బాల్ టీమ్స్ ఉన్నాయి. రియల్ మాడ్రిడ్(25.9) మాంచెస్టర్ సిటీ (22) తొలి రెండు స్థానాల్లో నిలవగా.. బార్సిలోనా (17.2) మాంచెస్టర్ యునైటెడ్(15.9) 4, 5 స్థానాల్లో నిలిచాయి. ఇక ఓవరాల్ గా(ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ) చూసుకుంటే బెంగళూరు ప్రధమ స్థానంలో ఉంది. మొత్తానికి ఫేస్ బుక్ లో ఐపీఎల్ లో అన్ని జట్లను దాటేసి ప్రపంచములోనే మూడో జట్టుగా కేకేఆర్ నిలవడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.