ఐపీఎల్, టీమిండియా కెప్టెన్సీని విరాట్ వదులుకోవడంపై డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అది జరిగినప్పటికీ కోహ్లీ అలా చేస్తున్నాడని అన్నాడు. ఇంతకీ ఏంటి విషయం?
విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే వేలకు వేల పరుగులు, ప్రపంచ రికార్డులే మనకు గుర్తొస్తాయి. బ్యాటర్ గా సచిన్ తర్వాత ఆ స్థాయిని అందుకుంది అంటే అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ కోహ్లీ. కానీ కెప్టెన్ గా మాత్రం చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ధోనీ తర్వాత ఆ బాధ్యతలు అందుకున్నప్పటికీ.. ఐసీసీ ట్రోఫీలని ఒక్కటి కూడా సాధించలేకపోయాడు. దీంతో కోహ్లీని ప్రతి ఒక్కరూ విమర్శించారు. అలా 2021లో ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి, గతేడాది టీమిండియా కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ఇప్పుడు ఓ ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు కోహ్లీ గురించి ఆర్సీబీ మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కోహ్లీ-డివిలియర్స్ బాండింగ్ గురించి ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్సీబీ జట్టుకు ఆడిన ఈ ఇద్దరూ కలిసి ఎన్నో మ్యాచుల్ని గెలిపించారు. ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టమనేది ఎప్పటికప్పుడూ బయటపెడుతూనే ఉంటారు. ప్రస్తుతం ఆర్సీబీకి సపోర్ట్ చేయడానికి మన దేశానికి వచ్చిన రీసెంట్ గా సీజన్ ప్రారంభానికి ముందు చిదంబరం స్టేడియంలో సందడి చేశారు. ఇప్పుడు కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ వదులుకోవడం గురించి మాట్లాడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని డివిలియర్స్.. కోహ్లీ ఇప్పుడు అందుకే ప్రశాంతంగా నవ్వుతున్నాడని అన్నాడు.
‘కోహ్లీలో పెద్దగా మార్పు రాలేదు. టెక్నిక్ అలానే బలంగా ఉంది. క్రీజులో చక్కగా కదులుతున్నాడు. ఈ సీజన్ కోసం బాగా రెడీ అయ్యాడు. కొన్ని ఇంటర్వ్యూస్ లో అతడిని చూస్తుంటే ముందు కంటే బాగా నవ్వతున్నాడు. కెప్టెన్సీ వదిలేయడమే దానికి కారణమని అనుకుంటున్నాను. అతడో అద్భుతమైన నాయకుడు. చాలాఏళ్లపాటు టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్ గా ఉండటం అంటే కాస్త కష్టమైన విషయమే. అప్పుడు అసలు టైమ్ దొరికేది కాదు. ఇప్పుడు కెప్టెన్ కాదు కాబట్టి కోహ్లీ నవ్వుతూ ఉన్నాడు. చెప్పాలంటే కొత్తగా కనిపిస్తున్నాడు. అతడు సరదాగా ఉంటే ఎంతో ఈజీగా రన్స్ కొట్టేస్తాడు.’ అని డివిలియర్స్ కోహ్లీ గురించి మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి కోహ్లీ కెప్టెన్సీ వదిలేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.