విరాట్ కోహ్లీని కలవడానికి చాలా మంది ఎదురు చూస్తుంటే.. కోహ్లీ మాత్రం ఒక వ్యక్తి కోసం వీలు చూసుకొని మరీ వచ్చాడు. ఆటోగ్రాఫ్ ఇస్తూ అందరి మనసులు గెలుచుకున్నాడు. మరి కోహ్లీ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ?
టీంఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే అందరికీ అతనిలోని దూకుడే కనిపిస్తుంది. గ్రౌండ్ లో అగ్రెస్సివ్ గా ఉండడం నిజమే అయినా.. మైదానం వెలుపల మానవత్వం చూపిస్తూ ఆకట్టుకుంటాడు కోహ్లీ. క్రికెటర్ గా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలను అధిగమించాడు. కోహ్లీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం చాలా మంది క్రికెట్ లోకి అడుగుపెడుతున్నారు. తన జట్టులోని ప్లేయర్లను ప్రోత్సహించడమే కాదు అవకాశమొస్తే తన మంచి తనాన్ని ప్రదర్శించి గొప్ప మనసు చాటుకుంటాడు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇంతకీ కోహ్లీ ఏం చేసాడు ?
మొహాలీ వేదికగా.. నేడు ఐపీఎల్ లో బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ ఇప్పటికే మొహాలీ చేరుకొని మ్యాచ్ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధర్మవీరు పాల్ దగ్గరకు వచ్చి కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ధర్మవీరు పాల్ ఒక వీల్ చైర్ క్రికెటర్ కావడంతో కోహ్లీ స్వయంగా అతన్ని కలిసి బ్యాట్ మీద తన సిగ్నేచర్ చేయడం విశేషం. కోహ్లీ లాంటి బిజీ క్రికెటర్ వీలు చూసుకొని మరి ఇలా కలవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం ఈ ఐపీఎల్ లో కోహ్లీ అదరగొట్టేస్తున్నాడు. ఇప్పటికే 5 మ్యాచుల్లో 3 అర్ధ సెంచరీలు చేసిన కోహ్లీ.. ప్రస్తుతం పంజాబ్ మీద జరుగుతున్న మ్యాచులో అర్ధ సెంచరీ(59)తో రాణించాడు. ఇక ఈ మ్యాచులో చాలా రోజుల తర్వాత కింగ్ కెప్టెన్సీ చేయడం చేస్తున్నాడు. డుప్లెసిస్ గాయపడడంతో కోహ్లీ బెంగళూరు జట్టుని నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. అయితే గాయమైనా డుప్లెసిస్ మాత్రం బ్యాటింగ్ చేయనున్నాడు. మరి ఓవైపు కింగ్ చూపించిన గొప్ప తనం మరో వైపు చాలా రోజుల తర్వాత బెంగళూరు జట్టుకి కెప్టెన్సీ, కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఇలా అభిమానులకి ఈ రోజు కోహ్లీ పెద్ద ట్రీట్ ఇచ్చాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.