ఐపీఎల్ లో భాగంగా రేపు (శనివారం ) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. ప్రస్తుతం ఆర్సీబీ తరపున ఐపీఎల్ ఆడుతున్న కోహ్లీకి ఈ మ్యాచులో ఒక అరుదైన గౌరవం దక్కనుంది. మరి విరాట్ కోహ్లీకి దక్కే అరుదైన గౌరవం ఏంటి ?ఇప్పుడు చూద్దాం.
టీంఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ కి చేసిన సేవలు మరువలేనిది. తన బ్యాటింగ్ తో ఇండియన్ క్రికెట్ టీంకి ఎన్నో చిరస్మరణీయ, చారిత్రాత్మాక విజయాలనందిచాడు. 15సంవత్సరాలుగా అలుపెరుగని యోద్ధుడిలా క్రికెట్ లో తనదైన మార్క్ వేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో కింగ్ ఎన్నో రికార్డులను, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కెప్టెన్ గాను రాణించి సత్తా చాటాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరపున ఐపీఎల్ ఆడుతున్న కోహ్లీకి ఒక అరుదైన గౌరవం దక్కనుంది. మరి విరాట్ కోహ్లీకి దక్కే అరుదైన గౌరవం ఏంటి ?ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ లో భాగంగా రేపు (శనివారం ) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. 9 మ్యాచుల్లో 5 మ్యాచులు గెలిచినా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 5 స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచుల్లో కేవలం 3 విజయాలతో చివరి స్థానంలో నిలిచింది. ఇక ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఆర్సీబీకి ప్రతి మ్యాచ్ కీలకంగా మారగా.. ఢిల్లీకి మాత్రం చావో రేవో లాంటిది. ఈ నేపథ్యంలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి. రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచుల్లో లో స్కోరింగ్ థ్రిల్లర్ లో గెలిచి ఆత్మవిశ్వాసంతో వస్తున్నాయి. ఇక మ్యాచ్ కోహ్లీకి ప్రత్యేకం కానుంది.
ఆర్సీబీకి ఢిల్లీ సొంత గ్రౌండ్ కాకపోయినా కోహ్లీకి మాత్రం ఇది హోమ్ గ్రౌండ్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీకి ఎంత క్రేజ్ ఉందో ఇక్కడ అంతకు మించి ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే కోహ్లీ పేరు మీద ఇక్కడ పెవిలియన్ స్టాండ్ ఉండడం విశేషం. భారత జట్టుకి విశేషమైన సేవలకు గుర్తింపుగా సొంత రాష్ట్రంలో స్టేడియంకి ఇలా ఓ వైపు వారి పేర్లు పెట్టి వారికి అరుదైన గౌరవం ఇస్తారు. ప్రస్తుతం కోహ్లీకి కూడా ఇలాంటి గౌరవం దక్కనుంది. రేపు ఢిల్లీలో తన పెవిలియన్ ఎదురుగా కోహ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. సాధారణంగా తన పెవిలియన్ తాను చూసుకొని ఆడడం అనేది క్రికెట్ లో అరుదులో అరుదుగా జరుగుతుంది. తాజాగా ఈ లిస్టులో కింగ్ కోహ్లీ చేరిపోయాడు. ఓ వైపు సొంత గ్రౌండ్, మరోవైపు తన పెవిలియన్. ఈ విషయంలో కోహ్లీ సంతోషం వ్యక్తం చేయగా.. అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి ఇంతటి ఘనత అందుకుంటున్న కోహ్లీకి రేపటి మ్యాచ్ ప్రత్యేకం కానుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.