విరాట్ కోహ్లీకి ఈ సీజన్ ఐపీఎల్ ఒక బ్యాటర్ గా మంచి అనుభవాలను ఇచ్చినా.. ఎప్పటిలాగే కప్ మిస్ అయిందనే వెలితి ఇంకా అలాగే ఉంది. అయితే ఇప్పుడు కోహ్లీ తీసుకున్న ఒక నిర్ణయం అందరిని ఆకట్టుకుంటుంది
విరాట్ కోహ్లీకి ఈ సీజన్ ఐపీఎల్ ఒక బ్యాటర్ గా మంచి అనుభవాలను ఇచ్చినా.. ఎప్పటిలాగే కప్ మిస్ అయిందనే వెలితి ఇంకా అలాగే ఉంది. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే గుజరాత్ మీద ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో చివరి వరకు పోరాడినా.. పరాజయం తప్పలేదు. కోహ్లీ అద్భుత సెంచరీతో చెలరేగినా.. ఎప్పటిలాగా బౌలర్లు విఫలమవడంతో నిరాశ తప్పలేదు. ఇక ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ కళ్ళలో నీళ్లు తిరగడం ఫ్యాన్స్ తో పాటుగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. అయితే ఈ మ్యాచులో ప్లే ఆఫ్ కి వెళ్ళలేదు అనే విషయాన్ని పక్కన పెడితే.. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో మైదానం వదిలి వెళ్లిన కోహ్లీ నొప్పితో కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే కోహ్లీకి గాయం పెద్దదేమీ కాదని కోచ్ సంజయ్ బంగర్ అప్ డేట్ ఇవ్వడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు కోహ్లీ తీసుకున్న ఒక నిర్ణయం అందరిని కదిలిస్తుంది.
గత కొంత కాలంగా తీరిక లేని క్రికెట్ ఆడుతున్నాడు కోహ్లీ. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆ తర్వాత ఆసీస్ తో వన్డే సిరీస్ ఐపీఎల్ ఇలా వరుసబెట్టి మ్యాచులాడడంతో ప్రస్తుతం కోహ్లీ బాగా అలసి పోయాడు. దీనికి నిన్న జరిగిన మ్యాచులో చిన్నపాటి గాయం చోటు చేసుకువడంతో కోహ్లీకి మరింత రెస్ట్ కావాలని భావించారు. అయితే ఇప్పుడు కోహ్లీ అవేమి పట్టించుకోకుండా రేపే ఇంగ్లాండ్ బయలుదేరుతున్నాడు. కోహ్లీ ఇంత అర్జెంట్ గా ఇంగ్లాండ్ బయలు దేరాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా ? ఎందుకు వెళ్తున్నాడో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2023 సందడి దాదాపుగా ముగిసిపోయిందనే చెప్పాలి. మరో వారం రోజుల తర్వాత ఈ సీజన్ ఐపీఎల్ కి ఎండ్ కార్డు పడనుంది. ఈ నేపథ్యంలో వాట్ నెక్స్ట్? అనే ప్రశ్న ప్లేయర్లతో పాటుగా.. అభిమానుల్లో కూడా ఉంటుంది. ఆలోచిస్తే ఐపీఎల్ తర్వాత భారత్ డబ్ల్యూటీసి ఫైనల్ ఆడేందుకు ఎంజిలాండ్ వెళ్లాల్సి ఉంది. జూన్ 7 న జరిగే ఈ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో భారత్ తలబడుతుండగా.. ఒవెల్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కి రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో కోహ్లీ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ బయలు దేరుతున్నాడు. కోహ్లీకి ఆట మీద ఉన్న అంకిత భావం ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తుంది. మరి కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.