విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ దెబ్బ ఎలా ఉంటుందో లక్నో సూపర్ జెయింట్స్‌కు అర్థమైంది. ఆ జట్టు గంభీర్‌కు షాక్ ఇస్తూ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఐపీఎల్-2023లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన అంశాల్లో విరాట్ కోహ్లీ-గౌతం గంభీర్ వివాదం ఒకటి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఈ ఇద్దరు లెజెండ్స్ బాహాబాహీకి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. కేఎల్ రాహుల్‌తో పాటు ఇతర ప్లేయర్లు నిలువరించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. అయితే కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడం లేదు. లక్నో మ్యాచ్ జరిగిన ప్రతిచోట గంభీర్‌తో పాటు కోహ్లీని గెలికిన నవీన్ ఉల్ హక్‌ను టార్గెట్ చేస్తున్నారు. గంభీర్ కనిపించగానే కోహ్లీ, కోహ్లీ అని అరుస్తూ అతడ్ని రెచ్చగొడుతున్నారు. మొన్న సన్‌రైజర్స్-లక్నోకు మధ్య జరిగిన మ్యాచ్‌లో అయితే కోహ్లీ ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయారు. లక్నో డగౌట్‌పై నీళ్ల సీసాలు విసిరారు.
లక్నో డగౌట్ మీద కోహ్లీ ఫ్యాన్స్ నీళ్ల సీసాలతో పాటు నట్లు, బోల్టులు కూడా విసిరారు. దీంతో లక్నో ప్లేయర్లతో పాటు ఆ ఫ్రాంచైజీ షాక్ అయ్యింది. కోహ్లీతో పెట్టుకుంటే ఇలా ఉంటుందా అని అర్థం అయినట్లుంది లక్నోకు. దెబ్బకు ఆ టీమ్ దిగొచ్చింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ బంపర్ విక్టరీ కొట్టడంతో ఆ జట్టును విష్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆర్సీబీ ఆట సూపర్ అంటూ గంభీర్‌కు షాక్ ఇస్తూ ఒక పోస్ట్ పెట్టింది ఎల్ఎస్జీ. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గంభీర్ అంతా ఓకేనా అంటూ అతడ్ని రెచ్చగొడుతున్నారు. మరోసారి కోహ్లీతో పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. విరాట్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఎలిమినేటర్‌లో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ చూడాలని ఉందని కామెంట్స్ పెడుతున్నారు.
@GautamGambhir is everything ok ?🙄 https://t.co/KVRDVIIVCr
— DeshBhakt (@Mr__GM23) May 14, 2023
One more time We want to See Gautam Gambhir Vs Virat Kohli
— Mr Perfect 🤟🏻 (@starmanjeet007) May 14, 2023
Lets hope Eliminator Rcb vs Lsg steel cage match😆!!
— Saurav (@saurav_b16) May 14, 2023