కోహ్లీ-గంభీర్ వివాదం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇద్దరు దిగ్గజ ప్లేయర్లు ఇలా గొడవపడటం ఏంటని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఆట మీద గౌరవం పెంచాల్సిన వారు.. బాహాబాహీకి దిగడం సరికాదని చెబుతున్నారు.
క్రికెట్‌ను జెంటిల్మన్ గేమ్‌గా పిలుస్తుంటారు. ఆటగాళ్లు పూర్తి ప్రొఫెషనలిజమ్‌తో ఆడితే జెంటిల్మన్ గేమ్ అనే దానికి సార్థకత వస్తుంది. కానీ గేమ్ కంటే కూడా మిగతా విషయాలను హైలైట్ చేస్తే అది ఆటకు ఏమాత్రం మంచిది కాదు. ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇదే ఎక్కువవుతోంది. గేమ్ కంటే కూడా ప్లేయర్ల మధ్య గొడవలు హైలైట్‌గా మారుతున్నాయి. విరాట్ కోహ్లీ-సౌరవ్ గంగూలీ వివాదం ఐపీఎల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంట్రవర్సీ సద్దుమణిగిందో లేదో మరో వివాదం మొదలైంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-గౌతం గంభీర్ వార్ హాట్ టాపిక్‌గా మారింది. గంభీర్‌తో పాటు నవీన్ ఉల్ హక్‌తో విరాట్ గొడవకు దిగడం వివాదాస్పదమైంది.
విరాట్-గంభీర్ గొడవలో ఎవరిది తప్పనేది పక్కనబెడితే.. నవీన్ ఉల్ హక్‌ను ‘నువ్వు నా కాలి ధూళితో సమానం’ అని కోహ్లీ అనడం కాంట్రవర్సీగా మారింది. మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవడం కామనే. అయితే శృతి మించి ప్రతి ఎమోషన్‌ను చూపించడం సబబు కాదు. అందులోనూ కోహ్లీ లాంటి లెజెండరీ ప్లేయర్ ఇలా ప్రవర్తించడం ఏంటని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ వివాదంపై టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప స్పందించాడు. ఆడే సమయంలో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయని.. కానీ వాటిని చూపించకూడదన్నాడు. ఏదైనా ఉంటే పరస్పరం మాట్లాడుకోవాలని.. ఇలా చేయడం మాత్రం సమంజసం కాదన్నాడు ఊతప్ప.
‘ఏదైమైనా ప్రత్యర్థి జట్టుతో పాటు ఆటను గౌరవించడం తప్పనిసరి. గేమ్ ముగిసిన తర్వాత ప్లేయర్లు పరస్పరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవాలి. ఇది ఆటను గౌరవించడంలో భాగం. అక్కడ ఏమైందో నాకు కూడా తెలియదు. వ్యక్తిగత గొడవలు ఉన్నా దాన్ని క్రికెట్ ఫీల్డ్‌లో చూపించకూడదు. ఇలాంటి వివాదంలో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ లాంటి దిగ్గజాలు కేంద్ర బిందువు కావడం కరెక్ట్ కాదు’ అని ఊతప్ప తేల్చిచెప్పాడు. తాను కోహ్లీకి పెద్ద అభిమానినని.. అయితే విరాట్ సెలబ్రేషన్స్‌కు మాత్రం తాను ఫ్యాన్ కానని పేర్కొన్నాడు. అతడేమీ 21 ఏళ్ల కుర్రాడు కాదని.. ఇలాంటి ప్రవర్తనను ఊహించలేదన్నాడు. కుర్రాళ్లకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఇలా చేయడం నచ్చడం లేదన్నాడు ఊతప్ప. కోహ్లీ-గంభీర్ వివాదంపై టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో ఎమోషన్స్ కామన్ అని.. కానీ వాటిని బహిరంగంగా చూపించడం సరికాదన్నాడు.
Robbin Uthappa said, “I am not a fan of Kohli’s celebration. You are not a 21-year-old and this kind of behaviour is unexpected” #Cricket #CricketNews #CricketTwitter #ViratKohli #IPL #IPl2023 #RCBvsLSG #LSGvsRCB pic.twitter.com/GyIlHYUorg
— CricInformer (@CricInformer) May 1, 2023