రాజస్థాన్ జట్టుపై గెలిచి హ్యాపీగా ఉన్న కోహ్లీకి షాక్ తగిలింది. డకౌట్ అయ్యాడనే బాధకి తోడు ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది.
ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. వరసగా రెండు మ్యాచులు గెలిపించాడని తెగ ఆనందపడిపోతున్నారు. కప్ కొట్టినంత సంతోషంగా ఫీలవుతున్నారు. డుప్లెసిస్ గాయం వల్ల పూర్తి మ్యాచ్ ఆడలేకపోతున్నాడు. అందుకే గత రెండింటితో పాటు మరికొన్ని మ్యాచులకు కోహ్లీ కెప్టెన్సీ చేయనున్నాడు. రీసెంట్ గా రాజస్థాన్ పై గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న కెప్టెన్ కోహ్లీతోపాటు ఆర్సీబీ క్రికెటర్ల అందరికీ షాక్ తగిలింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు విషయానికొస్తే.. ఆర్సీబీ రాజస్థాన్ పై అద్భుత విజయం సాధించింది. చిన్నస్వామి వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 189/9 స్కోరు చేసింది. ఛేదనలో రాజస్థాన్ జట్టు 182/6 స్కోరు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ గెలిచేసింది. ఈ మ్యాచులో కోహ్లీ కెప్టెన్ గా సక్సెస్ అయినప్పటికీ బ్యాటర్ గా ఫుల్ గా విఫలమయ్యాడు. ఎందుకంటే కనీసం ఒక్క పరుగైనా చేయకుండా డకౌట్ అయిపోయాడు. ఫ్యాన్స్ కి నిరాశ మిగిల్చాడు. ఇప్పుడు ఇదే అనుకుంటే మరో షాక్ తగిలింది.
రాజస్థాన్ తో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ అయిన కోహ్లీకి బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ రూల్ ఆఫ్ కండక్ట్ ప్రకారం రెండోసారి ఈ తప్పు చేసినందుకు గాను స్టాండిన్ కెప్టెన్ అయిన కోహ్లీకి రూ.24 లక్షల ఫైన్ వేసినట్లు స్పష్టం చేశారు. అలానే ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ తోపాటు మ్యాచ్ ఆడిన 11 మందికి రూ.6 లక్షల ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతం ఏది తక్కువైతే అది వేయడం అమలు చేస్తామని ఐపీఎల్ మండలి ప్రకటించింది. సో అదన్నమాట విషయం. మరి కోహ్లీకి జరిమానా విధించడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Virat Kohli fined 24 Lakhs for maintaining slow overrate.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2023