భారత క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఒక ప్రేత్యేకమైన స్థానం ఉంది. గత 15 ఏళ్లుగా బ్యాటింగ్ లో అదరగొడుతూ ప్రస్తుత తరంలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. చాలా మంది అప్ కమింగ్ ప్లేయర్లు క్రికెట్ లోకి రావడానికి కోహ్లీనే ఆదర్శం. ఎన్నో రికార్డులు అంతకు మించి రివార్డులు అందుకున్న కోహ్లీ శిఖరాన నిలిచాడు. అయితే ఇన్ని ఘనతలు సాధించిన కోహ్లీ.. దానికి కారణం ఎవరనే విషయం తాజాగా వెల్లడించాడు.
భారత్ స్టార్ విరాట్ కోహ్లీ ఎంత అగ్రెస్సివ్ గా ఉంటాడో మనందరికీ తెలిసిందే. అయితే ఆ అగ్రెస్సివ్ నెస్ వెనకాల ఎంతో కష్టం దాగి ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. జీవితంలో కష్టాలను ఎదుర్కొని పైకి వచ్చినప్పుడు మన సక్సెస్ ని ఎంజాయ్ చేసే క్రమంలో ఆ మాత్రం అగ్రెస్సివ్ గా ఉండడం కామన్. ప్రతి ఒక్కరి జీవితంలో తాను పైకి ఎదగడానికి ఒక మనిషి ఖచ్చితంగా ఉంటాడు. కోహ్లీ జీవితంలో కూడా అలాంటి వ్యక్తి ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్న కోహ్లీ.. ఓ బ్రాండ్ ప్రమోషన్ లో పాల్గొన్నాడు. సందర్భంగా ఆ వ్యక్తిని తలచుకుంటూ తన చిన్ననాటి సంగతులను గుర్తు తెచ్చుకొని ఈ స్టార్ బ్యాటర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.
భారత క్రికెట్లో కోహ్లీకి ఒక ప్రేత్యేకమైన స్థానం ఉంది. గత 15 ఏళ్లుగా బ్యాటింగ్ లో అదరగొడుతూ ప్రస్తుత తరంలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. చాలా మంది అప్ కమింగ్ ప్లేయర్లు క్రికెట్ లోకి రావడానికి కోహ్లీనే ఆదర్శం. ఎన్నో రికార్డులు అంతకు మించి రివార్డులు అందుకున్న కోహ్లీ శిఖరాన నిలిచాడు. అయితే ఇన్ని ఘనతలు సాధించిన కోహ్లీ.. దానికి కారణం ఎవరనే విషయం తాజాగా వెల్లడించాడు. అతనెవరో కాదు తన చిన్ననాటి కోచ్ “రాజ్ కుమార్”. మనం ఎంత సాధించిన మన సక్సెస్ కి కారణమైన వారిని మరిచిపోకూడదు. కోహ్లీ కూడా ఈ సందర్భంగా తన గురువుని గుర్తుకు తెచ్చుకొని కృతజ్ఞతలు తెలియజేసాడు.
“కొంతమందికి ఎల్లప్పుడూ ఆటే ప్రాధాన్యం. నేను ఆట మొదలు పెట్టినప్పటినుండి నాపై నమ్మకముంచిన వారికీ కృతజ్ఞతలు తెలుపునుకోవడం ఎంతైనా అవసరం. నేను ఎల్లప్పుడూ రాజ్ కుమార్ సర్ కి రుణపడి ఉంటాను. ఆయన నాకు కేవలం కోచ్ మాత్రమే కాదు.. నాకు మార్గ దర్శనం చేసిన మెంటార్ కూడా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచారు. క్రికెటర్ కావాలనే పెద్ద కలగన్న పిల్లాడిగా ఉన్న నాపై ఆయన నమ్మకముంచారు. ఆయన ప్రోత్సాహకమే నేను 15 ఏళ్ళ క్రితం ఇండియన్ జెర్సీ వేసుకునేలా చేసింది. నా కళను మీ కలగా భావించారు. ఎనెన్నో సలహాలు, సూచనలు, మెళకువలు మీరు నాకు చెప్పారు. ఢీలా పడినప్పుడు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఇన్ని చేసిన మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను”. అని కోహ్లీ థ్యాంకు నోట్ షేర్ చేసాడు. ఓ బ్రాండ్ ప్రమోషన్ సందర్భంగా తన కోచ్ స్టోరీ ఇది అంటూ ఇంస్టాగ్రామ్ లో పెట్టాడు. మరి కోహ్లీ తన గురువు మీద అభిమానం చాటుకోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.