ఐపీఎల్ లో ఆర్సీబీ ఏప్రిల్ 23 సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది కానీ కోహ్లీ మాత్రం తన బ్యాడ్ లక్ ని కంటిన్యూ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈసారి కూడా ఈ తేదీ మనోడికి అస్సలు కలిసి రాలేదు. ఇంతకీ ఏంటి విషయం?
పాపం కోహ్లీ.. నిన్న మ్యాచ్ చూసిన చాలామందికి దాదాపుగా ఇలానే అనిపించి ఉంటుంది! ఎందుకంటే అలా ఔటైపోయాడు మరి. అదేం విచిత్రమో కానీ చాలా మ్యాచుల్లో కోహ్లీ అదిరిపోయే బ్యాటింగ్ చేస్తాడు. సచిన్ తర్వాత ఏ బ్యాటర్ కు సాధ్యం కాని రికార్డులు క్రియేట్ చేస్తూ, దూసుకెళ్తున్నాడు. అలాంటి విరాట్.. అందరూ ఇంట్రెస్టింగ్ గా చూసే కొన్ని ముఖ్యమైన మ్యాచుల్లో మాత్రం చేతులెత్తేస్తున్నాడనే చెప్పాలి. అసలు రన్స్ కూడా కొట్టకుండా ఇలా క్రీజులో అడుగుపెట్టి, అలా పెవిలియన్ కి వెళ్లిపోతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా దాదాపు అలానే జరిగింది.
అసలు విషయానికొస్తే.. ఆర్సీబీ ప్రతి సీజన్ లో ఓ మ్యాచ్ గ్రీన్ కలర్ జెర్సీతో ఆడుతుంది. పర్యావరణ పరిరక్షణ అనే కాన్సెప్ట్ లో భాగంగా ఇలా స్పెషల్ మ్యాచ్ ఆడుతూ ఉంది. ఈ జెర్సీలతో ఆడిన మ్యాచుల్లో ఇప్పటివరకు 11 ఆడితే అందులో ఆరింటిలో ఓడిపోయింది. మూడింటిలో గెలిచింది. దానికి తోడు ఆర్సీబీకి ఏప్రిల్ 23 అంటేనే కాస్త భయం. గతంలో రెండుసార్లు భారీ స్కోర్లు చేసి ఇదే డేట్ లో గెలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్స్ అయిన 49, 68 పరుగులకు ఆర్సీబీ ఆలౌటై ఘోరంగా ఓడిపోయింది కూడా ఈ తేదీలోనే.
అందుకే ఈసారి ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా భయపడ్డారు. కానీ గ్రీన్ కలర్, ఏప్రిల్ 23 రెండు సెంటిమెంట్స్ ని ఆర్సీబీ బ్రేక్ చేసింది. రాజస్థాన్ పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ కోహ్లీ మాత్రం డకౌట్ అయిపోయాడు. ఆర్సీబీకి ఈ తేదీ అంటే భయమున్నట్లు కోహ్లీ కూడా సరిగ్గా ఇదే డేట్ లో.. ఆర్సీబీకి ఆడిన మ్యాచుల్లో ఏకంగా మూడుసార్లు డకౌట్ అయిపోయాడు. 2017లో కేకేఆర్, 2022లో సన్ రైజర్స్ చేతిలో ఏప్రిల్ 23న కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీటైంది. ఓవరాల్ గా అయితే ఐపీఎల్ కోహ్లీ ఏకంగా ఏడుసార్లు డకౌట్ అయ్యాడు. ఇదంతా చూస్తుంటే.. ఆర్సీబీకి కాదు కోహ్లీకి ఏప్రిల్ 23 కలిసిరాలేదనిపిస్తోంది. మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.