ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయిందనే బాధ కంటే కోహ్లీ సెంచరీ చేశాడనేది ఫ్యాన్స్ కాస్త రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. ఒకే ఒక్క సెంచరీతో మూడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడనే విషయం మీకు తెలుసా?
ఆర్సీబీకి మళ్లీ నిరాశ తప్పలేదు. వరసగా 16వ సీజన్ లోనూ కప్ కొట్టాలనేది కలగానే మిగిలిపోయింది. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. గుజరాత్ తో తాజాగా జరిగిన ఈ మ్యాచ్.. బెంగళూరు సొంతగడ్డపైనే జరిగింది. కానీ లాభం లేకుండా పోయింది. ఇందులో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందించదగ్గ విషయం ఏదైనా ఉందా అంటే అది కోహ్లీ సెంచరీ మాత్రమే. బ్యాక్ టూ బ్యాక్ శతకాలతో ఆకట్టుకున్న విరాట్… ఒకే దెబ్బతో మూడు సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. ప్రస్తుతం అవే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆర్సీబీ పేరు చెప్పగానే అందరికీ కోహ్లీనే గుర్తొస్తాడు. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ఈ టీమ్ లోనే ఉన్నాడు. మొదటి నుంచి ప్రస్తుత సీజన్ వరకు ప్రతిసారి ‘ఈ సాలా కప్ నమదే’ స్లోగన్ తో బరిలోకి దిగడం. అది జరగకుండానే నిష్క్రమించడం ఈ జట్టుకు అలవాటుగా మారిపోయింది. ఈసారి కూడా సేమ్ అదే రిపీటైంది. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ తో మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. కోహ్లీ అద్భుత శతకంతో 197/5 స్కోరు చేసింది. ఛేదనలో గుజరాత్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టాలనే ఆర్సీబీ ఆశల్ని చిదిమేసింది.
గత మ్యాచ్ లో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ.. గుజరాత్ పై కూడా సెంచరీ కొట్టి వావ్ అనిపించాడు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ టూ ఐపీఎల్ లో శతకాలు చేసిన వారి లిస్టులో టాప్ లోకి వచ్చేశాడు. ఇతడితోపాటు ధావన్, బట్లర్, గిల్ ఉన్నారు. మరోవైపు ఓవరాల్ గా ఐపీఎల్ లో 7వ సెంచరీ కొట్టిన కోహ్లీ అందరికంటే టాప్ లోకి వెళ్లిపోయాడు. మరోవైపు ఆర్సీబీ తరఫున డుప్లెసిస్ తో కలిసి ఈసారి 939 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తద్వారా 2016లో డివిలియర్స్ తో కలిసి చేసిన రన్స్ ని సమం చేశాడు. ఇలా ఒకే ఒక్క సెంచరీతో ఏకంగా మూడు రికార్డులను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. మరి దీనిపై మీరేం అంటారు? కింద కామెంట్ చేయండి.
𝗨𝗡𝗦𝗧𝗢𝗣𝗣𝗔𝗕𝗟𝗘 🫡
Back to Back Hundreds for Virat Kohli in #TATAIPL 2023 👏🏻👏🏻
Take a bow 🙌 #RCBvGT | @imVkohli pic.twitter.com/p1WVOiGhbO
— IndianPremierLeague (@IPL) May 21, 2023