భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ మనకు తెలిసిందే. కోహ్లీ గ్రౌండ్ లో అడుగుపెడితే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. అయితే కోహ్లీని ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలిగినా.. ఈ స్టార్ బ్యాటర్ ని కలిసే అదృష్టం దాదాపుగా జరగదు.అలాంటిదిది కోహ్లీ ఒకరికి బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. మరి అడగకుండానే కోహ్లీ ఎవరికీ బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చాడంటే?
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ మనకు తెలిసిందే. కోహ్లీ గ్రౌండ్ లో అడుగుపెడితే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. అయితే కోహ్లీని ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలిగినా.. ఈ స్టార్ బ్యాటర్ ని కలిసే అదృష్టం దాదాపుగా జరగదు. ఒకవేళా అలా జరిగితే జన్మ ధన్యం అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇటీవలే మ్యాచ్ లో కోహ్లీని కలవడానికి ఒక అభిమాని పడిన కష్టం అంతా ఇంతా కాదు. అలాంటిదిది కోహ్లీ ఒకరికి బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. మరి అడగకుండానే కోహ్లీ ఎవరికీ బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చాడంటే?
విరాట్ కోహ్లీ ఏది చేసిన అభిమానులకి పండగే. మొన్న లక్నో సూపర్ జయింట్స్ మ్యాచులో భాగంగా నవీన్ ఉల్ హక్, గంభీర్ లతో వివాదాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం సంగతి పక్కన పెడితే .. గొడవ జరిగి 24 గంటలు గడవకముందే కోహ్లీ తన మంచి మనసుని చాటుకున్నాడు. ఒక సర్ప్రైజ్ తో ఒక చిన్నోడికి తన బ్యాట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ అదృష్టవంతుడు ఎవరో కాదు బెంగళూరు బౌలర్ డేవిడ్ విల్లీ కొడుకు. కోహ్లీ సైన్ చేసిన ఈ బ్యాట్ ని చూసిన విల్లీ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. విల్లీ ఇంస్టాగ్రామ్ వేదికగా ఏ విషయాన్ని వెల్లడించి సంతోషం వ్యక్తం చేసాడు.
ప్రస్తుత్తమ్ ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరపున ఆడుతున్న విల్లీ.. ఇటీవలే గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో సీనియర్ ప్లేయర్ కేడర్ జాదవ్ జట్టులోకి చేరనున్నాడు. ఇక ఐపీఎల్ లో కోహ్లీ ఫామ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు 9 మ్యాచులాడిన కోహ్లీ 5 అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. 9 మ్యాచులాడిన ఆర్సీబీ టీమ్ 5 మ్యాచుల్లో విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్త్ కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇక మిగిలిన 5 మ్యాచుల్లో ఆర్సీబీ కనీసం 3 మ్యాచులోనైనా గెలిస్తే ప్లే ఆఫ్ కి చేరే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఫామ్ చాలా కీలకం కానుంది. మొత్తానికి విల్లీ కొడుకుకి కోహ్లీ బ్యాట్ గిఫ్ట్ గా ఇవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.