ఐపీఎల్ అంటేనే సిక్సులు, ఫోర్లతో అభిమానులని అలరించే పనిలో ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు బ్యాటర్లు వారి పవర్ హిట్టింగ్ తో భారీ సిక్సులు కొడుతూ అందరిని ఆశ్చర్యంలో పడేస్తారు. నిన్న జరిగిన మ్యాచులో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సన్ రైజర్స్ బ్యాటర్ కొట్టిన ఒక భారీ సిక్సర్ కి కావ్య మారన్ రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఐపీఎల్లో భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన కేకేర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగుల భారీ స్కోర్ చేసింది. త ఆర్డర్ విఫలమైన కెప్టెన్ నితీష్ రానా (42), రింకు సింగ్(46) భాగస్వామ్యంతో జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇక లక్ష్య ఛేదనలో మార్కరం సేన 166 పరుగులకే పరిమితమై.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్లాసన్, మార్కరం రాణించినా .. మిగిలిన వారి నుంచి సహకారం లభించకపోవడంతో ఓటమి తప్పలేదు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో సన్ రైజర్స్ బ్యాటర్ క్లాసన్ కొట్టిన ఒక సిక్స్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. అంతే కాదు SRH ఓనర్ కావ్య మారన్, కేకేఆర్ కెప్టెన్ నితీష్ రానా ఇచ్చిన రియాక్షన్ ఒకేలా ఉండడం ఇప్పుడు వైరల్ గా మారింది.
లక్ష్య ఛేదనలో టాప్ ఆర్డర్ తో పాటు బ్రూక్ కూడా ఔటవ్వడంతో 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టుని ముందుండే బాధ్యతని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్కరం, క్లాసన్ తీసుకున్నారు. కెప్టెన్ మార్కరం ఆచితూచి అడగా.. క్లాసన్ దూకుడు ప్రదర్శించాడు. ఇక ఇన్నింగ్స్ 11 ఓవర్లో క్లాసన్ రెండు భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. స్పిన్నర్ అంకుల్ రాయ్ వేసిన ఈ ఓవర్లో మొదటి సిక్సర్ 91 మీటర్లు వెళ్లగా.. ఐదో బంతికి కొట్టిన సిక్సర్ ఏకంగా 101 మీటర్ల దూరం వెళ్ళింది. అయితే క్లాసన్ ఈ సిక్సర్ కొట్టగానే హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ నోరెళ్ళబెట్టి అంతే చూస్తూ ఉండిపోయింది. వెంట వెంటనే రెండు సిక్సర్లు కొట్టడం.. అవి కూడా భారీ దూరం వెళ్లడంతో కావ్య మారన్ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. అంతే కాదు కేకేఆర్ కెప్టెన్ నితీష్ రానా కూడా ఇదే రియాక్షన్ ఇవ్వడం విశేషం. మరి వీరిద్దరి రియాక్షన్ ఒకేలా ఉండడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.