భారత ఆటగాళ్ల గాయాల సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. రానున్న నాలుగు నెలల్లో టీమిండియా చాలా కీలక టోర్నీలు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒకొక్కరు గాయాల బారిన ఇప్పుడు టీమిండియాను ఆందోళనకి గురి చేస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్ ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుండగా.. తాజాగా ఒక స్టార్ బ్యాటర్ గాయంతో WTC ఫైనల్ కూడా ఆడడం అనుమానంగా మారింది.
ఈ ఏడాది టీమిండియాకి చాల కీలకం కానుంది. ప్రతిష్టాత్మకమైన WTC ఫైనల్ తో పాటు ఆసియా కప్, వరల్డ్ కప్ కూడా ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒకొక్కరు గాయాలతో దూరమవ్వడం ఇపుడు టీమిండియాను కలవరపెడుతుంది. ఐపీఎల్ కి ముందే టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, పంత్ గాయాలతో దూరమైనా సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న భారత పేసర్లు జయదేవ్ ఉనాద్కట్, ఉమేష్ యాదవ్ ఈ లిస్టులోకి చేరిపోయారు. ఇక తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్, లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా గాయంతో మొత్తం ఐపీఎల్ కే దూరమయ్యాడు.
ఐపీఎల్ లో భాగంగా బెంగళూరుతో జరిగిన మ్యాచులో రాహుల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ సంగతి తెలిసిందే. స్టొయినీస్ బౌలింగ్ లో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కొట్టిన షాట్ ని ఆప్ ప్రయత్నంలో రాహుల్ తొడకండరాలు పట్టేసాయి. దీంతో తీవ్రనొప్పితో బాధపడిన రాహుల్ ఫిజియో సహాయంతో మైదానాన్ని వీడాడు. ఇక బ్యాటింగ్ లో కూడా 11 నెంబర్ లో వచ్చి ఆడడానికి కూడా చాల ఇబ్బంది పడ్డాడు. దీంతో రాహుల్ కి 4 నుంచి 5 వారాలు విశ్రాంతి కావాలని భావించడంతో మిగిలిన ఐపీఎల్ మ్యాచులకి దూరమయ్యాడు. అంతేకాదు వచ్చేనెలలో WTC ఫైనల్ ఉన్న నేపథ్యంలో రాహుల్ అప్పటిలోగా కోలుకోవడం కష్టమే. ఇదే జరిగితే రాహుల్ WTC కి దూరమవ్వనున్నాడు.
ప్రస్తుతం లక్నో జట్టుకి కెప్టెన్ గా ఉంటున్న రాహుల్ పర్వాలేదనిపిస్తున్నాడు. పరుగులు చేసినప్పటికీ జిడ్డు బ్యాటింగ్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించి వారికి విసుగు తెప్పించ్చాడు. అయితే ఐపీఎల్ అంటే నిలకడగా పరుగులు చేసే రాహుల్ లక్నో జట్టులో లేకపోవడం పెద్ద లోటు అని చెప్పాలి. చెన్నైతో జరిగిన గత మ్యాచులో రాహుల్ లేని లోటు స్పష్టంగా కనబడింది. ఇక రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్య లక్నోకి కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మొత్తానికి రాహుల్ గాయం ఇటు టీమిండియాకు, అటు లక్నో జట్టు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.