ఈడెన్స్ గార్డెన్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచులో గెలిచి జోరుమీదున్న ఆర్సీబీ తొలుత కాస్త పైచేయి సాధించినట్లు కనిపించినా.. శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్‌తో వారు డీలా పడిపోయారు.
ఈడెన్స్ గార్డెన్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచులో గెలిచి జోరుమీదున్న ఆర్సీబీ తొలుత కాస్త పైచేయి సాధించినట్లు కనిపించినా.. శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్‌తో వారు డీలా పడిపోయారు. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కేకేఆర్ జట్టుకు శార్దూల్ ఇన్నింగ్స్ ప్రాణం పోసిందనే చెప్పాలి. 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నశార్దూల్, సెహ్వాగ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. శార్దూల్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ప్రస్తుతానికి 17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
కాగా, అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్(57), వెంకటేశ్ అయ్యర్ (3) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మహమ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో హ్యాట్రిక్ బౌండరీలు వచ్చాయి. దీంతో కేకేఆర్ మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. అయితే డెవిడ్ విల్లే నాల్గవ ఓవర్ లో రెండు బంతుల్లో రెండు వికెట్లు తీయడం కేకేఆర్‌ను దెబ్బకొట్టింది. రెండో బంతికి వెంకటేశ్ అయ్యర్ (3)ను బౌల్డ్ చేసిన విల్లే, ఆ తర్వాత బంతికే మన్‌దీప్ సింగ్‌ను బౌల్డ్ చేశాడు. అనంతరం కాసేపటికే కెప్టెన్ నితీశ్ రానా(1)కే వెనుదిరగడంతో కేకేఆర్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రింకూ సింగ్‌తో జతకలిసిన శార్దూల్ ఠాకూర్ ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
First fifty for Shardul Thakur in IPL.
KKR return at Eden gardens after 1438 day and He smashed 20 balls fifty. Outstanding, Lord Thakur! pic.twitter.com/bVgUPYI9hn
— CricketMAN2 (@ImTanujSingh) April 6, 2023
Shardul Thakur has the fastest fifty by an Indian in IPL 2023. pic.twitter.com/spsAZf88sG
— Johns. (@CricCrazyJohns) April 6, 2023