ఐపీఎల్ లో రెండో మ్యాచ్ కు అంతా సిద్ధమైపోయింది. మొహాలీ వేదికగా పంజాబ్-కోల్ కతా జట్ల తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు? ప్లేయింగ్ XI ఏమై ఉండొచ్చు?
ఐపీఎల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. చివరివరకు థ్రిల్లింగ్ గా సాగిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం అందరూ రెడీ అయిపోయారు. ఈరోజు శనివారం.. అదేనంటి వీకెండ్ కావడంతో డబుల్ బొనాంజా ఉంది. మధ్యాహ్నం పంజాబ్-కోల్ కతా జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, రాత్రికి లక్నో-దిల్లీ జట్ల తలపడనున్నాయి. నైట్ మ్యాచ్ గురించి కాస్త వదిలేద్దాం. పంజాబ్-కోలో కతా మధ్య గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ జట్ల ప్లేయింగ్ XI ఎలా ఉండబోతుంది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం!
ఇక వివరాల్లోకి వెళ్తే.. కోల్ కతా జట్టుని గత సీజన్ లో ముందుండి నడిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈసారి మొత్తం సీజన్ కే దూరమయిపోయాడు. దీంతో కొత్త కెప్టెన్ గా నితీశ్ రానాని ఎంపిక చేశారు. ప్రస్తుతం చూస్తే కోల్ కతా టీంలో నరైన్, రసెల్ తప్పించి స్టార్ ప్లేయర్లు ఎవరూ కనిపించట్లేదు. వీరిద్దరూ జట్టుని ఎలా ముందుండి నడిపిస్తారనేది కీలకం. కెప్టెన్ తో సహా వెంకటేష్ అయ్యర్, నారాయణన్ జగదీష్ కు తక్కువ అనుభవమే ఉంది. షకీబ్ లాంటి ఆల్ రౌండర్ కూడా ఈ మ్యాచుకు అందుబాటులో లేడు. కొత్తగా వచ్చిన శార్దుల్ ఠాకుర్, ఫెర్గ్యూసన్ ఎలా ఆడతారనేది చూడాలి.
పంజాబ్ కింగ్స్ జట్టులో ఈసారి చాలానే మార్పులు జరిగాయి. కెప్టెన్ గా శిఖర్ ధావన్ అపాయింట్ అయ్యాడు. స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో.. గాయం కారణంగా మొత్తం సీజన్ కే దూరమయ్యాడు. రబాడ కూడా ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకుండా పోయాడు. ఉన్నవాళ్లలో సామ్ కరన్ కాస్త కనిపిస్తున్నాడు. కానీ కరన్ ఒక్కడే ఏం చేయలేడు కదా. షారుక్ ఖాన్, సికిందర్ రజా లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ పంజాబ్ బ్యాటింగ్ కాస్త వీక్ గానే కనిపిస్తుంది. బౌలింగ్ విభాగం మాత్రం అర్షదీప్, రాహుల్ చాహర్, మథ్యూ షార్ట్, సామ్ కరన్ లాంటి వాళ్లతో కాస్త బలంగా కనిపిస్తుంది. కానీ తొలి మ్యాచ్ కాబట్టి ఎలా ఆడుతుంది ఏంటనేది చూడాలి.
వెంకటేష్ అయ్యర్, నారాయణన్ జగదీషన్, నితీశ్ రానా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రసెల్, డేవిడ్ వీస్, సునీల్ నరైన్, శార్దుల్ ఠాకుర్, ఉమేష్ యాదవ్, లోకీ ఫెర్గ్యూసన్, వరుణ్ చక్రవర్తి
శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుక్ ఖాన్, రాజపక్స, సికిందర్ రజా, సామ్ కరన్, రిషి ధావన్, MW షార్ట్, జితేష్ శర్మ, హర్ ప్రీత్ బ్రర్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
ప్రెడిక్షన్: ఈ మ్యాచ్‌లో కోల్ కతా గెలిచే అవకాశం ఉంది.
𝐁𝐚𝐭𝐭𝐥𝐞 𝐑𝐞𝐚𝐝𝐲! ❤⚔💜
Sadde 🦁s are ready to bring the Jazba to Sadda Akhada once again. 💪🏽🔥#PBKSvKKR #JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL pic.twitter.com/8AGjvMckY4
— Punjab Kings (@PunjabKingsIPL) April 1, 2023