సన్ రైజర్స్ ఈ సీజన్ లో వరసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది.. కానీ ఓ విషయంలో కావ్యపాప సెలబ్రేషన్స్ మాత్రం వైరల్ గా మారాయి. చిన్నదానికే ఇంతలా ఓవరాక్షన్ చేయాలా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఆటగాళ్లపై కాదు అందరి కళ్లు కావ్య పాపపైనే ఉంటాయి. మ్యాచ్ ఎక్కడా జరిగినా చాలా సపోర్ట్ చేసి ఈమె.. అదే రేంజులో సెలబ్రేట్ చేసుకుంటుంది. స్టాండ్స్ లో ఎగిరి గంతులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అందుకే హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ అందరూ కూడా దాదాపు కావ్యపాపకు అభిమానులై ఉంటారు. సరే ఇదంతా కాసేపు పక్కనపెడదాం. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచులో కావ్య పాప కాస్త ఓవరాక్షన్ చేసిందా అనిపించింది. ఒక్క విషయంలో చేసిన సెలబ్రేషన్స్ ఆమెకు నార్మల్ గా ఉండొచ్చు కానీ చూసేవాళ్లకు మాత్రం కాస్త అతిలా అనిపించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. లక్నో-హైదరాబాద్ జట్ల మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 121/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. రాహుల్ త్రిపాఠి 35, అన్మోల్ ప్రీత్ సింగ్ 31 తప్పితే ఏ ఒక్కరూ కూడా కనీసం క్రీజులో నిలబడలేకపోయారు. కొత్తగా వచ్చిన కెప్టెన్ మార్క్రమ్ అయితే మరీ ఘోరంగా డకౌట్ అయిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఆడుతూ పాడుతూ టార్గెట్ పూర్తి చేసింది. బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా రెండింటింలోనూ ఆకట్టుకున్న కృనాల్ పాండ్య.. హైదరాబాద్ ఓటమికి కారణమయ్యాడు.
సన్ రైజర్స్ 121 పరుగులు చేసేసరికి.. సరేలే బౌలింగ్ తోనైనా డిఫెండ్ చేస్తారు, గతంలో ఇలాంటివి చాలా చేసున్నారు కదా అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లే విధ్వంసకర కైల్ మేయర్స్ వికెట్ ని 13 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్నప్పుడే తీశారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఫరూకీ బౌలింగ్ ఆడే క్రమంలో మేయర్స్ క్యాచ్ ఔటయ్యాడు. ఈ వికెట్ పడగానే సీట్ లో నుంచి లేచిమరీ కావ్యపాప సెలబ్రేషన్స్ చేసుకుంది. గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేసింది. కానీ ఆమె ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. ఎందుకంటే అది జరిగిన కాసేపటికే లక్నో మ్యాచ్ గెలిచేసింది. ఒక్క వికెట్ పడినందుకే కావ్యపాప ఇంతలా ఓవరాక్షన్ చేయడం ఎందుకని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. పొరపాటున మ్యాచ్ గెలిచి ఉంటే కావ్యపాపని అస్సలు ఆపలేకపోయేవాళ్లం బాబోయ్ అని అనుకుంటున్నారు. మరి కావ్యపాప సెలబ్రేషన్స్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Kavya maran always happy lossing match #srhvslsg #kavyamaran #ipl2023 #ipl pic.twitter.com/OhfeE4ashE
— Gupt Rudh (@GuptRudh) April 7, 2023