సన్ రైజర్స్ ఆడే మ్యాచుల్లో ప్లేయర్ల కంటే కూడా ఎక్కువగా హైలైట్ అవుతుంటారు ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్. ఆమె గ్రౌండ్లో ఉంటే చాలు అందరిలో జోష్ వస్తుంది. రైజర్స్ ఆటగాళ్లు బాగా ఆడితే ఎగిరి గంతేసే కావ్య పాప.. వాళ్ల ఓటమిని మాత్రం తట్టుకోలేకపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్ రైజర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆ జట్టు మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో హోమ్ గ్రౌండ్ ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో సునాయాసంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది ఎస్ఆర్హెచ్. 6 బాల్స్‌లో 9 రన్స్ చేయలేక ఓడిపోయింది. దీంతో రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ముఖం చిన్నబోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. కోల్‌కతా బ్యాటింగ్‌లో రింకూ సింగ్ (46), కెప్టెన్ నితీష్ రాణా (42) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (41). హెన్రిచ్ క్లాసెన్ (36) మాత్రమే రాణించారు. మయాంక్ అగర్వాల్ (18), రాహుల్ త్రిపాఠి (20), అబ్దుల్ సమద్ (21) తమకు దొరికిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.
ఎస్ఆర్హెచ్ విజయానికి 12 బాల్స్‌లో 22 రన్స్ కావాల్సిన టైమ్‌లో వైభవ్ అరోరా వేసిన 19వ ఓవర్లో మార్కో జాన్సన్ (1) ఔట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్‌తో పాటు కావ్యా మారన్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ ఒక బౌండరీ, వెంటనే నోబాల్‌కు అబ్దుల్ సమద్ మరో ఫోర్ కొట్టాడు. దీంతో కావ్య పాప ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే చివరి ఓవర్లో సమద్ ఔట్ అవ్వడం, జట్టు 3 రన్స్ మాత్రమే చేయడంతో ఓటమిపాలైంది. ఓటమిని జీర్ణించుకోలేని కావ్యా మారన్ ముఖం చిన్నబోయింది. ఎస్ఆర్హెచ్ ఓటమి నేపథ్యంలో నెటిజన్స్ కావ్య పాప ఎక్స్ప్రెషన్స్ మీద మీమ్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆమె కష్టం పగవాడికి కూడా రాకూడదని అంటున్నారు. కావ్య బాధపడటం తాము తట్టుకోలేకపోతున్నామని.. రైజర్స్ ప్లేయర్లు ఆమె కోసమైనా గెలవాలని కోరుతున్నారు.
Different moods of Kavya Maran from tonight’s game.
📸: Jio Cinema#IPL2023 #KaavyaMaran #KolkataKnightRiders #SRHvKKR pic.twitter.com/fZrbD3bO9S
— CricTracker (@Cricketracker) May 4, 2023