ముంబయి ఓడిపోవడానికి గిల్ సెంచరీ ఓ కారణం అయ్యుండొచ్చు. కానీ దీనికంటే పెద్ద సమస్య ముంబయికి నిన్నటి మ్యాచ్ లో ఎదురైంది. ఊహించని ఆ ప్రాబ్లమ్ వల్లే గెలిచే మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. ఇంతకీ ఏంటి సంగతి?
ముంబయి జట్టు గుజరాత్ చేతిలో క్వాలిఫయర్ లో ఓడిపోయింది. ఫైనల్ కి వెళ్లే అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఇలా జరగడానికి కారణం ఏంటా అని అడిగితే.. గిల్ సెంచరీ, మోహిత్ శర్మ బౌలింగ్ ఇలా మీకు తోచిన రీజన్స్ చెబుతారు. కానీ ఊహించని ఓ ప్రాబ్లమ్ ఎదురయ్యేసరికి ముంబయికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే టైంలో ప్లస్ అవుతాడనుకున్న ఓ ప్లేయర్.. కీలకమైన క్వాలిఫయర్ లో కొంపముంచే పనిచేశాడు. దీంతో రోహిత్ సేనకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. దీంతో మ్యాచ్ ని సమర్పించేసుకుంది. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొచ్చేస్తే.. అహ్మదాబాద్ లో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో తొలుత గుజరాత్ బ్యాటింగ్ చేసింది. 233/3 భారీ స్కోరు చేసింది. గిల్ కేక పుట్టించే సెంచరీ, సూపర్ షాట్స్ కి ముంబయి బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఛేదనలో ముంబయి బ్యాటర్లు హ్యాండిచ్చారు. ఒక్క సూర్య కుమార్ యాదవ్ 61, తిలక్ వర్మ 43 రన్స్ కొట్టి పరువు కాపాడే ప్రయత్నం చేశారు. లేకపోయింటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి గిల్ సెంచరీ కారణమని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు విలన్ ముంబయిలో ఉన్నాడని గుర్తించలేకపోయారు.
జోఫ్రా ఆర్చర్ కి రీప్లేస్ మెంట్ గా ముంబయి జట్టులోకి వచ్చిన ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్.. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లలో 56 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దీంతోపాటు ఇషాన్ కిషన్ ని గాయపరిచాడు. 16వ ఓవర్ వేసిన తర్వాత జోర్డాన్ టోపీ సర్దుకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగా ఇషాన్ కిషన్ ని చూసుకోలేదు. దీంతో కిషాన్ ఎడమ కంటికి జోర్డాన్ మోచేయి బలంగా తాకింది. నొప్పితో గ్రౌండ్ నుంచి బయటకెళ్లిపోయిన అతడు బ్యాటింగ్ చేయలేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ క్రీజులో ఏ మాత్రం నిలబడినా సరే ముంబయి గెలిచే ఛాన్స్ ఉండేదేమో. మరోవైపు బంతిని ఆపబోయి రోహిత్ చేతికి గాయమైంది. హార్దిక్ బౌన్సర్ తాకడంతో గ్రీన్ కూడా ఈ మ్యాచ్ లో గాయపడ్డారు. ఇలా జోర్డాన్ తోపాటు ఊహించని విధంగా కీలక ప్లేయర్లు గాయపడటం గెలవాల్సిన మ్యాచ్ లో ముంబయిని ఓడిపోయేలా చేశాయి. మరి దీనిపై మీరేం అంటారు? కింద కామెంట్ చేయండి.
Chris Jordan elbow hits Ishan Kishan eye and injured Ishan moves out. Hope he recovers soon, he most important player for Mumbai Indians today. #MIvsGT #GTvsMI pic.twitter.com/gjLia5IF3Y
— Silly Context (@sillycontext) May 26, 2023